HomeViralViral News: వింత ఘటన.. పంది కడుపులో ఏనుగు పిల్ల అవతారం!

Viral News: వింత ఘటన.. పంది కడుపులో ఏనుగు పిల్ల అవతారం!

📰 Generate e-Paper Clip

Viral News: నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక విచిత్ర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో జరిగిన ఈ సంఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య అనే రైతు పందులను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. తన ఇంటి ఆవరణలో చిన్న పందిరి నిర్మించి పశుపోషణ ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్న ఆయనకు ఇటీవల జరిగిన సంఘటన అనుకోని షాక్‌ను మిగిల్చింది. ఆయన పెంచుతున్న ఒక పంది మొదటి ఈతలో మొత్తం 7 పిల్లలకు జన్మనిచ్చింది. ప్రారంభంలో ఈ విషయంతో సంతోషించిన వెంకటయ్య, కొద్దిసేపటికి ఒక పంది పిల్ల ఆకారం చూసి విస్తుపోయాడు.

ఆ 7 పిల్లల్లో ఒకటి సాధారణ పంది పిల్లల మాదిరిగా కాకుండా, ఏనుగు పిల్లను పోలి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పంది పిల్లకు తొండంలాంటి ముందుభాగం, పెద్ద చెవులు కనిపించడం వల్ల చూసిన వెంటనే ఏనుగు పిల్ల గుర్తుకు వచ్చేలా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం గ్రామంలో వేగంగా వ్యాపించడంతో, కార్పాముల గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున వెంకటయ్య ఇంటికి చేరుకుని ఆ వింత పంది పిల్లను చూడటానికి తరలివచ్చారు. సాధారణంగా కనిపించని ఈ రకమైన ఆకారం స్థానికుల్లో ఆసక్తి, ఆశ్చర్యాన్ని కలిగించింది.

అయితే ఈ ఘటనలో ఒక విషాదం కూడా చోటు చేసుకుంది. జన్మించిన కొద్ది సమయంలోనే ఆ ప్రత్యేక ఆకారంలో ఉన్న పంది పిల్లతో పాటు మరో పంది పిల్ల కూడా మృతిచెందింది. ప్రస్తుతం మిగిలిన 5 పంది పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం గ్రామంలో కలకలం రేపుతుండగా, వింత ఆకారంలో పంది పిల్ల జన్మించడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది.

ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. వింత ఆకారంతో ఉన్న ఆ పంది పిల్ల ఫోటోలు చూసి నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పశు వైద్యులు ఈ ఘటనను శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తున్నారు. జన్యుపరమైన లోపాల కారణంగానా లేదా ఇతర కారణాల వల్లనా ఈ రకమైన రూపాంతరం జరిగిందా అన్న దానిపై పరిశోధనలు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, శరీర నిర్మాణంలో మార్పులు ఏర్పడే పరిస్థితులపై మరింత అధ్యయనం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Snake Rescue: ఏంటీ మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా..

RELATED ARTICLES

Most Popular