HomeInterestingAfter Death: మరణం తర్వాత ఇన్ని దశలా..?

After Death: మరణం తర్వాత ఇన్ని దశలా..?

📰 Generate e-Paper Clip

After Death: మరణం తర్వాత ఏమి జరుగుతుందనే ప్రశ్న మానవాళిని ఎన్నో శతాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది. పౌరాణిక కథలు, సినిమాలు, సంప్రదాయ నమ్మకాల ప్రకారం మనిషి ప్రాణం విడిచిన వెంటనే యముడు లేదా ఆయన దూతలు వచ్చి తీసుకెళ్తారని, పాపపుణ్యాల ఆధారంగా స్వర్గం లేదా నరకానికి చేరుతారని అనేక మంది విశ్వసిస్తుంటారు. అయితే దీనిపై స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ లేవు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక విచిత్ర కథనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూసఫ్ షకుర్ అనే వ్యక్తి గీసిన ఒక బొమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఆ చిత్రంలో అతడు మరణం తర్వాత మనిషి ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాడు. ఆ బొమ్మను పరిశీలిస్తే అది భూమిని మరో లోకంతో కలిపే ఒక రహస్య మ్యాప్‌లా కనిపిస్తోంది.

యూసఫ్ షకుర్ అనే వ్యక్తి ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సుమారు 2 సంవత్సరాల పాటు కోమాలో ఉన్నట్లు సమాచారం. వైద్యులు అతడి పరిస్థితిని అత్యంత విషమంగా భావించి ఆశలు వదిలేసిన సమయంలో అతడు అకస్మాత్తుగా కళ్లు తెరిచినట్లు చెబుతున్నారు. స్పృహలోకి వచ్చిన తర్వాత అతడు తాను మరణాన్ని అనుభవించి తిరిగి వచ్చానని, ఆ లోకం పూర్తిగా వేరుగా ఉంటుందని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆ అనుభవాన్ని మాటల్లో వివరించలేనని చెప్పిన అతడు ఒక నోట్ పుస్తకంలో తనకు కనిపించిన దృశ్యాలను గీసి చూపించాడు. ఆ చిత్రాన్ని చూసిన వారు విస్తుపోయారు. అతడు గీసిన చిత్రంలో ఆత్మ భూమిని విడిచిన తర్వాత అనేక దశలను దాటి ఒక ప్రత్యేక లోకానికి చేరుకుంటుందని సూచించేలా గీతలు, వలయాలు, గుర్తులు కనిపిస్తున్నాయి.

ఆ చిత్రాన్ని పరిశీలిస్తే కింద భాగంలో భూమిని పోలిన ఒక గోళం గీసి, దానిపై మనుషులు నిలబడి ఉన్నట్లు చూపించారు. ఆ గోళం పైన వరుసగా మరికొన్ని వలయాలు ఉండగా, అవి పైలోకాల దారుల్లా కనిపిస్తున్నాయి. ప్రతి దశను కలుపుతూ వెండి రంగులో కనిపించే సన్నని తీగలు గీసి, వాటిని అతడు ‘సిల్వర్ కార్డ్స్’గా పేర్కొన్నట్లు సమాచారం. ఆ తీగలకు కొన్ని మనుషుల ఆకారాలు వేలాడుతున్నట్లు చూపించడం ద్వారా ఆత్మలు ఆ మార్గంలో పైకి ప్రయాణిస్తున్నాయనే భావనను వ్యక్తం చేశాడు. ఆ మధ్య దశను అతడు ట్రాన్సిట్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. చివరిభాగంలో తలక్రిందులుగా ఉన్న గోళంలాంటి ఆకారాన్ని గీసి, దానిపై వి ఆకారాలు, చిన్న గోళాలు చేర్చడం ద్వారా అది ఆత్మ చేరే తుదిగమ్యస్థానం కావచ్చని అర్థమవుతోంది.

యూసఫ్ చెప్పిన వివరాల ప్రకారం ఈ విశ్వంలోని ప్రతి మనిషి ఒకే మూలానికి అనుసంధానమై ఉన్నారని, ఆ అనుసంధానాన్ని ఈ వెండి తీగలే కలుపుతున్నాయని అతడు పేర్కొన్నాడు. అతడి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. గతంలో కూడా మరణ అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చినట్లు చెప్పిన కొందరు వ్యక్తులు కాంతివంతమైన వెలుగును చూశామని, వేరొక లోకానికి వెళ్తున్న అనుభూతి కలిగిందని వెల్లడించిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూసఫ్ చెప్పిన విషయాలను పూర్తిగా నిరాకరించలేమని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఇది కేవలం మానసిక అనుభవం కావచ్చని అంటున్నారు.

ఈ కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ద్వారా వేగంగా వైరల్ అవుతోంది. అయితే యూసఫ్ ఎవరు, ఆయన ఏ ప్రాంతానికి చెందినవారు, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు స్పష్టంగా బయటకు రాలేదు. దీంతో ఈ విషయంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శాస్త్రీయంగా ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే, మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుందనే ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేకపోయినా, ఇలాంటి కథనాలు మాత్రం మనసులో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి.

ALSO READ: Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

RELATED ARTICLES

Most Popular