పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం
ఇంటింటి ప్రచారానికి దిగిన కాంగ్రెస్ నేతలు
ప్రజల మద్దతు కోరుతున్న 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి
పార్టీ అభ్యర్థి వెంట తరలివచ్చిన మద్దతుదారులు
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వర్ధన్నపేట పట్టణకేంద్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ మరింత వేడెక్కుతోంది. ఈ క్రమంలో పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని పొద్దుపొద్దున్నే ముమ్మరం చేసింది. ఆదివారం రోజున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో ఈ ప్రచారం సాగింది.
వార్డు పరిధిలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తమకు అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తామని అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి ఓటర్లకు హామీ ఇచ్చారు.
ప్రచారంలో పాల్గొన్న పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజలకు వివరించారు. అదే సమయంలో గత పాలకుల పనితీరుపై విమర్శలు గుప్పిస్తూ ఈసారి మార్పు అవసరమని ఓటర్లను కోరారు. పార్టీ జెండాలు, నినాదాలతో వార్డు అంతా సందడిగా మారింది.
ALSO READ: Oppo మైండ్ బ్లోయింగ్ స్కెచ్.. రూ.11 వేలకే 220MP సెన్సార్
Last Updated on February 8, 2026 · 9:29 AM by Star Trinethram



