Collector Satya sharadha: పాలనలో వేగం.. సేవలో నిబద్ధత

  • ప్రజల మన్ననలు పొందుతున్న కలెక్టర్ సత్య శారద
  • ప్రజావాణికి ప్రాధాన్యం.. సమస్యల పరిష్కారమే లక్ష్యం
  • సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా.. వరంగల్‌కు దిశానిర్దేశం
  • ప్రతి అడుగులో తనదైన ప్రత్యేక విజన్
  • విపత్తులో అప్రమత్తత.. పాలనలో నిబద్ధత, నిష్పాక్షికత
  • రైతు, విద్యార్థి, మహిళ.. అందరికీ అండగా..
  • సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు అద్ధం
  • ‘మా కలెక్టర్ మేడం’గా ప్రజల గుండెల్లో స్థానం
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పెషల్.. మీ ‘స్టార్ త్రినేత్రం’లో..

Intro: తెలంగాణలో ప్రజా ప్రభుత్వ దిశానిర్దేశంతో పాలనకు కొత్త ఊపు వచ్చింది. ఫైలు కదలికకే పరిమితం కాకుండా ఫీల్డ్‌లోకి దిగి ప్రజలతో మమేకమవుతున్న అధికారుల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ముందుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విదంగా ప్రజల మధ్యనే పాలన సాగిస్తూ.. సంక్షేమ పథకాల అమలు నుంచి ఎన్నికల నిర్వహణ, రైతు సమస్యల పరిష్కారం నుంచి భూసేకరణ వరకు ప్రతి అంశంలో స్పష్టమైన ఫలితాలు అందిస్తున్నారు. వేగవంతమైన నిర్ణయాలు, నిబద్ధతతో కూడిన పరిపాలన, ప్రజావాణిపై ప్రత్యేక దృష్టి.. అలా ప్రతి అడుగులోనూ ఆమె పనితీరు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. ‘మా కలెక్టర్ మేడం’ అని వరంగల్ ప్రజలు గర్వంగా పలకడం వెనుక ఇదే నిజమైన కారణం.

స్టార్ త్రినేత్రం, వరంగల్: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కంటే మెరుగ్గా అధికారులు పోటీపడి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం ప్రజలకు శరవేగంగా ప్రభుత్వ ఫలాలు అందడంలో సాయం చేస్తోంది. ఇక ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ, బాగా పనిచేసిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

ఇందులో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టర్‌ డాక్టర్ సత్యశారద పనితీరుపై ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సత్య శారద.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు మరింత చేరువయ్యేలా తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. పరిపాలనా నిర్ణయాల్లో వేగం, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి అదే సమయంలో తన దగ్గరికి వచ్చిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కారం చేయడంలో నిబద్దతతో పనిచేస్తున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో సత్య శారద తీసుకుంటున్న చొరవ ప్రజల మన్ననలు పొందుతున్నారు. సామాన్య ప్రజలు సైతం నేరుగా కలెక్టర్‌ను కలిసే అవకాశం ఉండటం, వారి సమస్యలను వింటున్న ఆమె.. బాధితులకు భరోసా కల్పించడంలో ముందుంటున్నారు. ఫలితంగా కలెక్టర్ పనితీరు శభాష్‌ అని సామాన్యులు సైతం కితాబిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్లుగా ఐఏఎస్‌లు కేవలం ఆఫీసులకే పరిమితం కావొద్దని ప్రజల్లో ఉండాలని చెప్పినట్లుగానే తరచూ ఫీల్డ్ విజిట్ చేస్తూ ఇటు అధికారులు, అటు ప్రజలతో మమేకమవుతూ కీలక సూచలను చేస్తున్నారు సత్యశారద. ఇటీవల మిర్చి సీజన్ సందర్భంగా వరంగల్ మార్కెట్ యార్డును సందర్శించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అంతేగాదు రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను వినడమే కాదు పరిష్కారం దిశగా చొరవచూపారు. ముఖ్యంగా మార్కెట్‌కు వచ్చే మహిళా రైతుల కోసం ఏనమాముల మిర్చి యార్డులో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తీసుకున్న చొరవపై అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా అధికారులకు దిశా నిర్దేశం చేయడం, అదే సమయంలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టారు.

ముఖ్యంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటమే కాదు.. హరిత పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో ఆమె పనితీరుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ పోలింగ్ శాతం అంటే ఓటర్లను ఓటు వేసేందుకు ఆమె చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు సత్ఫలితాన్నిచ్చాయి. ప్రజలకు ఓటుపై అవగాహన పెంచడమే కాదు.. పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని స్పెషల్ డ్రైవ్స్ సైతం నిర్వహించారు జిల్లా కలెక్టర్ సత్యశారద.

ఓ వైపు ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరడమే కాదు మరోవైపు అభివృద్ధిలో సైతం తన మార్క్ చూపిస్తున్నారు సత్యశారద. ముఖ్యంగా వరంగల్ ప్రజల చిరకాల కల మామునూర్ ఎయిర్‌పోర్టు భూసేకరణలో పురోగతి సాధించారు. భూసేకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తకావడంలో కలెక్టర్ చూపించిన విజన్‌ అందరి చేత ప్రశంసలు అందుకునేలా చేసింది.

అలాగే గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నడుం బిగించిన కలెక్టర్‌.. ఆదర్శ పాలన అందించేలా సర్పంచ్‌లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి, ప్రజలకు ఆదర్శ పాలన అందాలని ఆమె చూపిస్తున్న చొరవ సర్పంచ్‌లను సైతం మంత్రముగ్దులను చేస్తోంది. అలాగే జిల్లాలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పెద్దపీట వేస్తున్నారు. పండగలు, ఆయా మతాలు నిర్వహించే ర్యాలీల సమయంలోనే ఎక్కడా భద్రతాపరమైన లోపాలు లేకుండా అధికారులకు తగిన సూచనలు ఇవ్వడమే కాదు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

అలాగే విపత్తుల సమయంలోనూ జిల్లా యంత్రాంగాన్ని ముందుండి నడిపించిన పేరుతెచ్చుకున్నారు. విపత్తు నిర్వహణలో అప్రమత్తత, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడంలో ప్రధాన భూమిక పోషించారు. ఫలితంగా వాతావరణ శాఖ ఇచ్చే సూచనలు రైతులు, ప్రజలకు చేరడంతో నష్ట నివారణ జరగకుండా చూశారు. పాలన అంటే ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడమే కాదు, వాటి పరిష్కారానికి మార్గం చూపినప్పుడే సామాన్యుకు న్యాయం జరుగుతుందని భావించిన కలెక్టర్‌ ఆ దిశగా ప్రత్యేక అడుగులు వేస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడమే కాదు.. అధికారులను ఆ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ఫలితంగా ప్రజలు కూడా కలెక్టర్ పనితీరుపై సంతృప్తితో ఉన్నారు.

ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజలకు నేరుగా దళారుల ప్రమేయం లేకుండా చేయడంలో కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని అన్ని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నాంటే అతిశయోక్తికాదు. అలాగే రోడ్డు భద్రత & అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలోనూ మేడమ్ తీరు సపరేటే. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు స్వయంగా అవగాహన కల్పిస్తూ ముందుకుసాగుతున్నారు. మొత్తంగా తనదైన పనితీరుతో ఇటూ ప్రభుత్వం నుండి ప్రశంసలే కాదు.. ప్రజల నుండి మా కలెక్టర్ మేడం అని పేరుతెచ్చుకున్నారు ‘సత్యశారద’.

ALSO READ: CM Revanth Reddy: మహిళల కోసం చట్టాలు రూపొందిస్తే సరిపోదు

Collector Satya sharadha: పాలనలో వేగం.. సేవలో నిబద్ధత

Last Updated on March 8, 2026 · 12:02 PM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles