CI Kranthi kumar: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

CI Kranthi Kumar: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పరకాల సీఐ క్రాంతికుమార్ పేర్కొన్నారు. పరకాల పోలీస్ స్టేషన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సమాజంలో మహిళల పాత్ర, వారి కృషి, వివిధ రంగాల్లో వారు సాధిస్తున్న విజయాలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మహిళా కానిస్టేబుళ్లను శాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం సీఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో మహిళలు చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళలు బాధ్యతతో పనిచేస్తూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని అన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూ, తమ ఉనికిని, ప్రతిభను చాటుకోవడంతో పాటు వివిధ రంగాలను శాసిస్తున్నారని అన్నారు. మహిళలు ఇంటికి పరిమితం కాకుండా సాంకేతిక, రాజకీయ, విద్యా రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. సమానత్వం కోసం సాగిన సమరమే మహిళా దినోత్సవం కాబట్టి ఆకాశంలో సగభాగమైన మహిళలు అవకాశాల్లో, అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని అన్నారు. శ్రమలో పుట్టి, పెరుగుతున్న శ్రామిక నారీమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ: Chahat Bajpai: హనుమకొండ జిల్లాను మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తాం

Last Updated on March 8, 2026 · 7:50 PM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles