Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

RBI Rules: ఒకేసారి 2, 3 పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చా..?

Author
Posted By STAR TRINETHRAM
| 25 Apr 2026, 10:09 PM | Business
RBI Rules: ఒకేసారి 2, 3 పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చా..?

RBI Rules: ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో అవసరం వచ్చినప్పుడు చాలా మంది ముందుగా ఆశ్రయించేది రుణాలనే. వ్యక్తిగత అవసరాలు, వైద్య అత్యవసరాలు, ఇల్లు, కారు కొనుగోలు వంటి సందర్భాల్లో పర్సనల్ లోన్లు కీలకంగా మారాయి. అయితే ఇప్పటికే ఒక పర్సనల్ లోన్ కొనసాగుతుండగా మరో రుణం తీసుకోవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి ఎన్ని రుణాలు తీసుకోవాలనే అంశంపై కఠిన పరిమితులు లేవు. అంటే చట్టపరంగా ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ రుణాలు పొందడంపై ప్రత్యక్ష అడ్డంకి ఉండదు. కానీ కొత్త రుణం మంజూరు చేయాలా లేదా అన్నది పూర్తిగా బ్యాంకులు, రుణ సంస్థలు చేపట్టే అర్హత పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. ఆదాయం, చెల్లింపు సామర్థ్యం, క్రెడిట్ చరిత్ర వంటి అంశాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు.

కొత్త రుణం మంజూరులో బ్యాంకులు అత్యంత ప్రాధాన్యంగా పరిశీలించే అంశం డెట్ టు ఇన్‌కమ్ నిష్పత్తి. అంటే నెలవారీ ఆదాయంలో ఎంత భాగం ఇప్పటికే అప్పుల వాయిదాలకు వెళ్తుందో దీనివల్ల అంచనా వేస్తారు. సాధారణంగా ఆదాయంలో 35 శాతం వరకు ఈఎంఐలు ఉంటే అది సురక్షిత స్థాయిగా పరిగణిస్తారు. ఉదాహరణకు నెల జీతం రూ.50000 అయితే ఇప్పటికే రూ.10000 ఈఎంఐ చెల్లిస్తుంటే డెట్ టు ఇన్‌కమ్ నిష్పత్తి 20 శాతం మాత్రమే అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో మరో రుణానికి అవకాశాలు మెరుగ్గా ఉండవచ్చు. అయితే ఈఎంఐ భారం రూ.25000 దాటితే బ్యాంకులు కొత్త రుణంపై వెనుకంజ వేయవచ్చు. ఎందుకంటే అధిక అప్పులు భవిష్యత్ చెల్లింపుల సామర్థ్యంపై ప్రభావం చూపుతాయని ఆర్థిక సంస్థలు భావిస్తాయి.

పర్సనల్ లోన్ల విషయంలో క్రెడిట్ స్కోర్ కూడా కీలక ప్రమాణంగా మారుతుంది. హామీ లేకుండా ఇచ్చే రుణాలు కావడంతో బ్యాంకులు దరఖాస్తుదారుడి ఆర్థిక క్రమశిక్షణను క్రెడిట్ స్కోర్ ఆధారంగా అంచనా వేస్తాయి. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే అనుకూలంగా చూస్తారు. గతంలో తీసుకున్న రుణాల చెల్లింపులు సకాలంలో జరిగాయా, ఈఎంఐల్లో ఆలస్యాలు ఉన్నాయా, బకాయిల చరిత్ర ఏంటి వంటి అంశాలు ఇందులో కీలకం. క్రమబద్ధమైన చెల్లింపు చరిత్ర ఉన్నవారికి ఒకటి కంటే ఎక్కువ రుణాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కసారి చెల్లింపుల్లో జాప్యం జరిగినా భవిష్యత్ రుణ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఒకటి కంటే ఎక్కువ రుణాలు తీసుకోవడం తక్షణ సమస్యలకు పరిష్కారంలా కనిపించినా, దీర్ఘకాలంలో ఆర్థిక ఒత్తిడికి దారితీయొచ్చు. ఈఎంఐలు పెరిగేకొద్దీ నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి పెరిగి నిత్యావసర ఖర్చులు కూడా ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంటుంది. ఒక అప్పు తీర్చేందుకు మరో అప్పు తీసుకునే పరిస్థితి ఏర్పడితే అది అప్పుల ఉచ్చులోకి నెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాదు అనుకోని పరిస్థితుల్లో ఒక్క ఈఎంఐ మిస్ అయినా క్రెడిట్ స్కోర్ దెబ్బతిని భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది. అందుకే రెండో పర్సనల్ లోన్ తీసుకునే ముందు అవసరం నిజంగా అత్యవసరమా, తిరిగి చెల్లించే సామర్థ్యం ఎంత వరకు ఉందో బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. ఆశకు పోయి అప్పుల భారాన్ని పెంచుకోవడం కంటే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే నిర్ణయం తీసుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: Hero Akshay Kumar: నా కూతురిని నగ్న ఫోటోలు పంపమని అడిగాడు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: