Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

KTR: వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ

Author
Posted By STAR TRINETHRAM
| 06 May 2026, 01:01 PM | Telangana
KTR: వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ

KTR: కేటీఆర్ వరంగల్ జిల్లా చరిత్ర, పోరాట స్పూర్తిని గుర్తుచేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాకతీయ పౌరుషాలకు ప్రతీకగా నిలిచిన ఈ నేల త్యాగాల గడ్డ, పోరాటాల గడ్డగా పేరుగాంచిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఈ నేలపై ప్రారంభమైన ప్రతి ఉద్యమం విజయవంతమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వరంగల్ నుంచి పోరాటాల శంఖం ఊదితే ద్రోహుల గుండెల్లో భయం పుడుతుందని వ్యాఖ్యానించారు.

హనుమకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. రైతుల ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు మాయ మాటలు చెప్పారని, వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించి పెద్దఎత్తున హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీలతో ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ నాయకత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్.. రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన 34 హామీల్లో ఒక్కటిని కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. బాండ్ పేపర్లపై హామీలు రాసి రైతులను నమ్మించి ఓట్లు దక్కించుకున్నారని ఆరోపించారు. ఈ హామీలను నమ్మి రైతులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లు గడిచినా రైతు డిక్లరేషన్ గురించిన చర్చే లేదని కేటీఆర్ విమర్శించారు. ఆ హామీలపై ప్రశ్నిస్తే ఎవరూ స్పందించడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ALSO READ: Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: