Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Viral News: వధువు వింత కండిషన్.. అతిగా నగలు వేసుకుంటే పెళ్లిలోకి నో ఎంట్రీ!

Author
Posted By STAR TRINETHRAM
| 15 Mar 2026, 11:42 AM | Viral
Viral News: వధువు వింత కండిషన్.. అతిగా నగలు వేసుకుంటే పెళ్లిలోకి నో ఎంట్రీ!

Viral News: పెళ్లి వేడుక అంటే సాధారణంగా వధూవరుల కంటే అతిథుల హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు పోటీపడి మరీ ఖరీదైన పట్టుచీరలు, భారీ బంగారు ఆభరణాలు ధరించి వస్తుంటారు. కానీ ఒక వధువు మాత్రం తన పెళ్లి రోజున తానే ప్రధాన ఆకర్షణగా ఉండాలని భావించి అతిథుల అలంకరణపై ప్రత్యేక ఆంక్షలు విధించింది. ఈ ఆసక్తికర సంఘటన చైనాలో చోటుచేసుకుంది. సాధారణంగా పెళ్లి ఆహ్వాన పత్రంలో వేడుక సమయం, వేదిక వివరాలు మాత్రమే ఉంటాయి. అయితే ఈ వధువు పంపిన ఆహ్వానంలో మాత్రం ప్రత్యేక దుస్తుల నిబంధనలతో పాటు ఆభరణాలపై కూడా నియమాలు పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వధువు సూచనల ప్రకారం.. పెళ్లికి వచ్చే అతిథులు ఎవరూ మెడ నిండా ఆభరణాలు ధరించకూడదని స్పష్టం చేసింది. కేవలం సాధారణంగా ఉండే చెవిపోగులు లేదా సన్నని గొలుసు మాత్రమే ధరించాలనే నిబంధన పెట్టింది. అంతేకాకుండా వధువు ధరించే దుస్తుల రంగుకు దగ్గరగా ఉండే రంగులు లేదా వధువుకంటే మరింత ప్రకాశవంతంగా కనిపించే దుస్తులు కూడా అతిథులు ధరించరాదని పేర్కొంది. ఈ నియమాలను పాటించని వారిని వేడుక జరిగే ప్రాంగణంలోకి అనుమతించబోమని కూడా ఆమె స్పష్టంగా చెప్పింది. ఈ వింత ఆహ్వాన పత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీసింది.

వధువు చెప్పిన కారణం కూడా ఆసక్తికరంగానే ఉంది. తన జీవితంలో పెళ్లి రోజు అత్యంత ముఖ్యమైన రోజు అని, ఆ రోజు అందరి దృష్టి తనపైనే ఉండాలని ఆమె భావించింది. వజ్రాలు, బంగారు ఆభరణాలతో మెరిసిపోయే అతిథుల వల్ల వధువు ఆకర్షణ తగ్గిపోతుందని ఆమె అభిప్రాయం. విదేశాల్లో పెళ్లిళ్ల సమయంలో వధువు ధరించే తెలుపు రంగు దుస్తులను అతిథులు ధరించడం అవమానంగా భావించే సంప్రదాయం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు అదే విధమైన భావన ఆభరణాల విషయంలో కూడా కనిపించడం ప్రారంభమైందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వధువు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆమె జీవితంలోని ముఖ్యమైన రోజు కావడంతో అలాంటి కోరిక ఉండటం సహజమని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం అతిథులను పిలిచి వారి అలంకరణపై ఆంక్షలు విధించడం మర్యాదకరం కాదని విమర్శిస్తున్నారు. మన దేశంలో కూడా కొందరు ప్రముఖుల పెళ్లిళ్లలో ప్రత్యేక నిబంధనలు అమలు చేయడం కనిపిస్తుంది. ఉదాహరణకు వేడుకలో మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదు లేదా ఒకే రకమైన రంగుల దుస్తులు ధరించాలి వంటి నియమాలు ఉంటాయి. అయితే సాధారణ మధ్యతరగతి కుటుంబాల పెళ్లిళ్లలో ఇలాంటి నియమాలు అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ALSO READ: Rain Alert: ఇదిగో వెదర్ రిపోర్ట్.. ఇక వర్షాలే వర్షాలు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: