Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Eega Damodhar: బాధిత కుటుంబానికి పరామర్శ

Author
Posted By STAR TRINETHRAM
| 20 Feb 2026, 10:20 PM | Telangana
Eega Damodhar: బాధిత కుటుంబానికి పరామర్శ

ఆడెపు సోమయ్య కుటుంబానికి అండగా ఈగ దామోదర్

Eega Damodhar: వర్ధన్నపేట పట్టణకేంద్రంలోని 8వ వార్డుకు చెందిన ఆడెపు సోమయ్య మరణవార్త స్థానిక ప్రజలను విషాదంలోకి నెట్టింది. కుటుంబానికి తీరని లోటు ఏర్పడిన ఈ సమయంలో స్థానిక నాయకులు ముందుకు వచ్చి తమ మద్దతు ప్రకటించారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఈగ దామోదర్ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి, వారి దుఃఖాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా 25 కేజీల బియ్యం, 5 కేజీల నూనె అందజేశారు. అవసరమైన సమయంలో అన్నివేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సామాజిక బాధ్యతగా బాధిత కుటుంబానికి తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఈగ దామోదర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో పూజారి శ్రీను, బక్కతట్ల రాజు, రామగిరి క్రాంతి, పూజారి సురేష్, కోలా సంధ్య, తోట శ్రీను, శివ, గణేష్, పవన్, రమేష్, సత్యనారాయణ కార్తీక్, పున్నేల్ సోమన్న తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: AUS vs OMAN: T20 WC 2026లో ఆస్ట్రేలియా విధ్వంసం

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: