Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Kakinada: పండుగపూట కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఇద్దరు మహిళలు మృతి

Author
Posted By STAR TRINETHRAM
| 15 Feb 2026, 12:09 PM | Andhra Pradesh
Kakinada: పండుగపూట కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఇద్దరు మహిళలు మృతి

Kakinada: పండుగ పర్వదినంలో కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా సర్పవరం జాతీయ రహదారి వద్ద శనివారం అర్ధరాత్రి ఒక కారును వెనుక నుండి వచ్చిన టిప్పర్ లారీ ఘోరంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయపడి చికిత్స కోసం బయటపడారు. గాయపడ్డవారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

ప్రాణాలతో బయటపడిన కార్ డ్రైవర్ ప్రదీప్ మీడియాతో మాట్లాడుతూ.. అతను గూగుల్ మ్యాప్ షార్ట్‌కట్ సూచనలను అనుసరించడం వల్ల సాధారణ రూట్ కాకుండా వెళ్ళడం వల్ల ఈ ఘోరం సంభవించిందని తెలిపారు. ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో అపరిహార్యమైన శోకాన్ని నింపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నం అక్షయ్యపాలెం ప్రాంతానికి చెందిన కొల్లి అనుదీప్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. ఇటీవల మేనత్త మరణించడంతో కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన తల్లి వెంకటపద్మావతి (59) మరియు పిన్ని దీప్తి (45)తో కలిసి కాకినాడకు వచ్చారు. పరామర్శ ముగించుకుని తిరిగి విశాఖ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.

ఇవి కూడా చదవండి

తన కళ్లముందే తల్లి, పిన్ని మరణించడం అనుదీప్‌కు తీవ్ర దుఃఖాన్ని నింపింది. ఆయన బోరున కన్నీరు పెట్టిన క్షణాలను స్థానికులను సైతం కంటతడి పెట్టించాయి. పోలీసులు ఘటనా స్థలంలో సాక్ష్యాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన పరిస్థితులను, ట్రాఫిక్ నియంత్రణ అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

ALSO READ: Andhra Pradesh: చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: