Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆ ఫోటో తీసి పంపితే.. ఖాతాలోకి రూ.1000

Author
Posted By STAR TRINETHRAM
| 14 Feb 2026, 11:00 PM | National
ఆ ఫోటో తీసి పంపితే.. ఖాతాలోకి రూ.1000

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రకటించింది. జాతీయ రహదారులపై పరిశుభ్రతకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. జూన్ 30 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా టోల్ గేట్ల వద్ద అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్ల ఫోటోలు పంపించిన వారికి ఉచితంగా రూ.1000 ఫాస్టాగ్ రీఛార్జ్ అందించనుంది. వాహనదారులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. చిన్న ఫోటో తీసి పంపితే సరిపోతుంది.

జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, వాటి నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్రత కారణంగా వాటిని ఉపయోగించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను ఫోటో తీసి ముందుగా పంపించిన వారికి రూ.1000 ఫాస్టాగ్ రీఛార్జ్ జమ చేస్తామని National Highways Authority of India వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థ తన అధికారిక ఎక్స్ వేదిక ద్వారా ప్రకటించింది.

ఫోటోలను ‘రాజమార్గ్ యాత్ర’ యాప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అపరిశుభ్రంగా ఉన్న జియో ట్యాగ్ మరుగుదొడ్ల చిత్రాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫోటోతో పాటు ప్రాంత వివరాలు, వాహనదారుడి పేరు, వాహన నమోదు సంఖ్య, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ముందుగా పంపిన వారి వాహన నమోదు సంఖ్యకు అనుసంధానమైన ఫాస్టాగ్ ఖాతాలో రూ.1000 జమ చేస్తారు. దేశవ్యాప్తంగా National Highways Authority of India పరిధిలోని అన్ని టోల్ గేట్ల వద్ద ఈ పథకం అమల్లో ఉంటుంది. అయితే ఒకే టోల్ గేట్ వద్ద రోజుకు ఒకసారి మాత్రమే ప్రోత్సాహకం ఇస్తారు. ఫోటో పంపేటప్పుడు జియో ట్యాగ్, సమయ ముద్ర స్పష్టంగా ఉండేలా చూడాలి.

ఇవి కూడా చదవండి

హైవేలపై ప్రయాణించే వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కేంద్రం పేర్కొంది. ఈ చర్యతో టోల్ గేట్ల వద్ద ఉన్న మరుగుదొడ్లు పరిశుభ్రంగా నిర్వహించబడతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

ALSO READ: వర్ధన్నపేటలో ఈగ మల్లేశం జన్మదిన వేడుకలు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: