Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వర్ధన్నపేటలో ఈగ మల్లేశం జన్మదిన వేడుకలు

Author
Posted By STAR TRINETHRAM
| 14 Feb 2026, 08:46 PM | Telangana
వర్ధన్నపేటలో ఈగ మల్లేశం జన్మదిన వేడుకలు

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో వర్ధన్నపేట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం జన్మదినోత్సవ వేడుకలు శనివారం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి కులస్తులు ఈగ మల్లేశం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి, కేక్ కటింగ్ చేసి అనంతరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దూరి సంజీవరావు, పెద్దూరి ప్రభాకర్, పెద్దూరి సత్యం, మార్త సారంగపాణి, చిప్ప వెంకటేశ్వర్లు, గడ్డం సదానందం, వన్నాల నాగరాజు, చిదురాల కేదారి, పాశికంటి రామచంద్రం, చెన్న చందర్రావు, చెన్న వెంకటేశ్వర్లు, చెన్న శ్రీధర్, పిట్ట సతీష్, పెద్దూరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: పెళ్లికి మంచి ముహుర్తాలు ఇవే..

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: