Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇదీ మావా శోభితా ధూళిపాళ్ల రేంజ్.. టాప్-3 రొమాంటిక్ రోల్స్.. మీరు చూశారా?

Author
Posted By STAR TRINETHRAM
| 04 Feb 2026, 05:00 PM | Entertainment
ఇదీ మావా శోభితా ధూళిపాళ్ల రేంజ్.. టాప్-3 రొమాంటిక్ రోల్స్.. మీరు చూశారా?

తెలుగు అమ్మాయి అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటీమణి శోభిత ధూళిపాళ్ల. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తోంది. మోడ్రన్ వెడ్డింగ్ ప్లానర్‌గా అయినా, సీక్రెట్ ఏజెంట్‌గా అయినా, హిస్టారికల్ పాత్రలో అయినా.. ప్రతి క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేయడం ఆమె ప్రత్యేకతగా మారింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అనే తేడా లేకుండా శోభిత చేసిన పాత్రలు ఆమెను గ్లోబల్ ఆడియన్స్‌కు దగ్గర చేశాయి. టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులో ఉన్న శోభిత కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ బెస్ట్ 7 పర్ఫార్మెన్సెస్ ఏవో ఇప్పుడు చూద్దాం.

అడివి శేష్ హీరోగా తెరకెక్కిన తెలుగు స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ శోభిత కెరీర్‌లో ఓ అండర్‌రేటెడ్ జెమ్‌గా నిలిచింది. ఈ సినిమాలో ‘సమీర’ అనే సైకాలజీ గ్రాడ్యుయేట్ పాత్రలో ఆమె నటన కథకు కీలకంగా మారుతుంది. మొదట్లో సాధారణంగా అనిపించే ఈ క్యారెక్టర్.. కథలో వచ్చే మలుపులతో కీలకంగా మారడం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సస్పెన్స్, డ్రామా మిక్స్ అయిన ఈ పాత్రలో శోభిత చూపించిన ఎమోషనల్ డెప్త్ సినిమాకు అదనపు బలంగా మారింది.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాలో శోభిత పాత్ర తక్కువ నిడివి ఉన్నప్పటికీ భారీ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసింది. తాజ్ హోటల్ ఉగ్రదాడి సమయంలో అక్కడ చిక్కుకున్న బందీ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. భయంతో, అసహాయతతో, ప్రాణభయంతో ఉన్న సాధారణ మహిళ మానసిక స్థితిని ఆమె కళ్లతోనే పలికించడం ఈ పాత్రకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ ఎపిక్ ‘పొన్నియిన్ సెల్వన్’లో శోభిత చోళ యువరాణి వానతి పాత్రలో కనిపించింది. ఐశ్వర్య రాయ్, త్రిష వంటి దిగ్గజ నటీమణులు ఉన్నప్పటికీ, తనదైన గ్రేస్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌తో శోభిత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పీరియడ్ డ్రామాల్లో ఆభరణాల భారంతో పాటు భావోద్వేగాలను మోయడం అంత సులభం కాదు. కానీ శోభిత ఆ సవాల్‌ను ఎంతో నాజూకుగా ఎదుర్కొంది.

కేరళలో సంచలనం సృష్టించిన రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ‘కురుప్’లో శోభిత గ్లామరస్ టచ్ ఉన్న కీలక పాత్రలో నటించింది. రెట్రో లుక్‌లో ఆమె మేకోవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రైమ్, మిస్టరీ, ఫేక్ ఐడెంటిటీల చుట్టూ తిరిగే కథలో ఆమె పాత్ర కథనాన్ని ముందుకు నడిపించే లింక్‌లా పనిచేసింది.

ఇవి కూడా చదవండి

శోభిత కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన వెబ్ సిరీస్‌గా ‘మేడ్ ఇన్ హెవెన్’ను చెప్పుకోవచ్చు. ఢిల్లీకి చెందిన వెడ్డింగ్ ప్లానర్ తారా ఖన్నా పాత్రలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బయటకు ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించే మహిళ, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొనే భావోద్వేగ సంఘర్షణలను ఆమె సహజంగా ఆవిష్కరించింది. ఈ సిరీస్ శోభితలోని అసలైన నటిని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

స్టైలిష్ స్పై థ్రిల్లర్ ‘ది నైట్ మేనేజర్’లో కావేరీ దీక్షిత్ పాత్రలో శోభిత మిస్టీరియస్‌గా, క్లాసీగా కనిపించింది. ఆయుధాల వ్యాపారి సామ్రాజ్యంలోకి హీరో ప్రవేశించడానికి కీలక పాత్ర పోషించే ఈ క్యారెక్టర్‌లో ఆమె సైలెన్స్, కళ్లతో పలికించే ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టార్ నటులు ఉన్నా, తన ఉనికిని స్పష్టంగా చూపించగలిగింది.

షారుక్ ఖాన్ ప్రొడక్షన్‌లో తెరకెక్కిన ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’లో శోభిత ఇంటెలిజెన్స్ అనలిస్ట్ పాత్రలో కనిపించింది. ప్రమాదకరమైన మిషన్ల మధ్య సాగే కథలో ఆమె పాత్ర ధైర్యం, డిటెర్మినేషన్‌తో ముందుకు సాగుతుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు, క్లిష్ట పరిస్థితుల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకునే ఆఫీసర్‌గా ఆమె నటన ప్రశంసలు అందుకుంది.

ALSO READ: Andhra Pradesh: అమరావతికి బిల్ గేట్స్!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: