T20 World Cup 2026: ప్రధానితో PCB చైర్మన్ నఖ్వీ అత్యవసర భేటీ

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనాలా.. వద్దా.. అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో ప్రధానంగా టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు నఖ్వీ వెల్లడించారు. దేశ ప్రయోజనాలు క్రికెట్ భవిష్యత్తు అంతర్జాతీయ పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశం పాకిస్తాన్ క్రికెట్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశం అనంతరం నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ.. బాయ్ కాట్ అంశం ఇంకా పరిశీలన దశలోనే ఉందని తెలిపారు. తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే అన్ని కోణాల్లో ఆలోచించి ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ అంశంపై తుది నిర్ణయం వచ్చే శుక్రవారం లేదా సోమవారం రోజున వెల్లడించే అవకాశం ఉందన్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికే పాకిస్తాన్ జట్టును ప్రకటించినప్పటికీ కూడా బాయ్ కాట్ అంశాన్ని పక్కన పెట్టలేదని నఖ్వీ వెల్లడించడం. అవసరమైతే జట్టు ఎంపికలో మార్పులు కూడా జరిగే అవకాశముందని ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచాయి.

ఇదిలా ఉండగా టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ ఆడినప్పటికీ ఇండియాతో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు పాకిస్తాన్ జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. రాజకీయ ఉద్రిక్తతలు భద్రతా కారణాలు ఈ నిర్ణయానికి కారణాలుగా పేర్కొంటున్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే స్పష్టత రానుందని పీసీబీ వర్గాలు అంటున్నాయి. ప్రపంచ క్రికెట్‌లో కీలకమైన ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తుది నిర్ణయం వెలువడే వరకు అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

ALSO READ: Ponguleti Srinivasa Reddy: వర్ధన్నపేటలో రూ.294 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Last Updated on January 27, 2026 · 3:40 AM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles