KVS TGT Jobs: త్వరలోనే కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

KVS TGT Jobs: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సుగమ మార్గం సిద్ధమైంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 987 పోస్టులను భర్తీ చేయనుందని అధికారులు వెల్లడించారు.

పోస్టుల విభజన

TGT స్పెషల్ ఎడ్యుకేటర్స్: 493 పోస్టులు

PRT స్పెషల్ ఎడ్యుకేటర్స్: 494 పోస్టులు

కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం

ఈ నియామక ప్రక్రియకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కేంద్రీయ విద్యాలయ రీజినల్ కార్యాలయాల నివేదిక ప్రకారం.. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, అభ్యర్ధులు పోస్టుల వివరాలు, అర్హత ప్రమాణాలు, రాష్ట్రాల వారీ ఖాళీలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

TGT స్పెషల్ ఎడ్యుకేటర్ అర్హతలు..

కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాలి

స్పెషల్ లేదా జనరల్ బి.ఎడ్ డిగ్రీ ఉండాలి

ప్రత్యేక విద్యలో డిప్లొమా అవసరం

CTET పేపర్- 2 పాస్ కావాలి

భారత పునరావాస మండలిలో రిజిస్ట్రేషన్ ఉండాలి

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

PRT స్పెషల్ ఎడ్యుకేటర్ అర్హతలు..

గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ (తరగతి 12) పూర్తి

డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్

CTET పేపర్- 1 పాస్

హిందీ, ఇంగ్లీష్ బోధించే సామర్థ్యం ఉండాలి

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

దరఖాస్తు విధానం..

  • నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి
  • అభ్యర్ధులు KVS అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అర్హతలు, వయస్సు, డాక్యుమెంటేషన్ పూర్తిగా పరిశీలనలోకి వస్తాయి

ఎంపిక విధానం..

అర్హత ప్రమాణాల ఆధారంగా ప్రాథమిక స్క్రీనింగ్

CTET స్కోరు, విద్యా అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక

అవసరమైతే ఇంటర్వ్యూ / ట్రయల్ బోధన ద్వారా చివరి ఎంపిక

ALSO READ: Medical Negligence: ప్రభుత్వ ఆస్పత్రిలో చక్కర్లు కొడుతున్న వీధి కుక్క

Last Updated on January 27, 2026 · 6:17 AM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles