Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సమస్యలతో మానసికంగా కుంగిపోయిన ఓ యువ మేస్త్రీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం ఘటన స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించింది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తన కుమారుడికి 6 నెలల క్రితమే వివాహం జరిగినప్పటికీ, భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడం వల్ల అతను తీవ్ర మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాడని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మొరాదాబాద్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల మేస్త్రీ అనీక్ పాల్, మఝోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్షీరామ్ కాలనీలో తన తండ్రి భూరేతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి రాంపూర్ జిల్లాలోని టాండా ప్రాంతానికి చెందిన మధుతో 6 నెలల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది కాలానికే భార్యాభర్తల మధ్య చిన్న విషయంపై వివాదం చోటుచేసుకుని, ఆ తర్వాత భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రి వివరాల ప్రకారం.. అనీక్ పాల్ తన భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, ఆమె రాకపోవడంతో అతను మానసికంగా తీవ్రంగా కుంగిపోయాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఏప్రిల్ 03 రాత్రి సమయంలో అనీక్ పాల్ తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం అతన్ని నిద్రలేపేందుకు తండ్రి తలుపు తట్టగా ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే ఇరుగుపొరుగు వారు, బంధువుల సహాయంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా, ఉరితాడుకు వేలాడుతున్న తన కుమారుడి మృతదేహాన్ని చూసి తండ్రి షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బంధువులు, స్థానికులు ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనను అనుమానాస్పదంగా పరిగణిస్తూ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు స్పష్టమవుతాయని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. భార్యాభర్తల మధ్య చిన్న వివాదం కూడా ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
ALSO READ: Zid: రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్ కజిన్.. చూస్తే ఒంటరిగా చూడండి..
Last Updated on April 6, 2026 · 11:50 AM by Star Trinethram



