Ashu Reddy: బంగారం ఫ్లాట్లు, కార్లు అన్నీ కొనిపించుకుంది.. చివరకు
Ashu Reddy: నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై నమోదైన కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పెళ్లి పేరుతో మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు, బంగారం, ఆస్తులు కాజేసిందంటూ లండన్‌లో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వైవి ధర్మేంద్ర హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. షేక్‌పేట్‌కు చెందిన ధర్మేంద్ర 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అషురెడ్డితో పరిచయం ఏర్పడిందని, అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చానని ఆమె తనకు చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పరిచయం ప్రేమగా మారి, పెళ్లి చేసుకుందామని నమ్మించి తన నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుందని ఆరోపించాడు. ఆర్థిక అవసరాలు, వ్యక్తిగత ఇబ్బందులు పేరుతో వరుసగా డబ్బులు అడుగుతూ కారు, బంగారం, ఫ్లాట్లు, ఇతర ఆస్తులు కొనుగోలు చేయించి వాటిని తన పేరిటే రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఫిర్యాదులో వెల్లడించాడు.
కొన్ని రోజుల పాటు పెళ్లి విషయమై అషురెడ్డి కుటుంబ సభ్యులు కూడా హడావుడి సృష్టించి, తర్వాత ఒక్కసారిగా దూరమయ్యారని ధర్మేంద్ర పేర్కొనడం మరింత ఆసక్తి రేపుతోంది. 2025 వరకు తన కుమారుడి నుంచి దాదాపు రూ.9.35 కోట్లు అషురెడ్డి తీసుకుందని ధర్మేంద్ర తండ్రి కూడా ఆరోపించారు. అంతేకాదు రూ.35 కోట్ల విలువైన నగదు లావాదేవీలు, సుమారు 5 కిలోల బంగారం, విలాసవంతమైన కార్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయించుకుందని పేర్కొనడం కేసుకు కొత్త మలుపు తీసుకొచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల రికార్డులు, సంబంధిత ఆధారాలపై పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం సినిమా రంగంలోనే కాక సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా అషురెడ్డి సోషల్ మీడియా ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించింది. గ్లామర్ ఫొటోలు, వీడియోలు, రీల్స్‌తో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్న ఆమె.. బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొని మరింత క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాంటి సమయంలో ఈ స్థాయి ఆరోపణలు వెలుగులోకి రావడం సినీ, టెలివిజన్ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ధర్మేంద్ర చేసిన ఆరోపణలపై అషురెడ్డి ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారగా, ఈ కేసు మరిన్ని కీలక వివరాలు బయటపెడుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.
ALSO READ: PM Kisan Scheme: ఒక్కో రైతు బ్యాంక్ అకౌంట్లోకి రూ.44 వేలు జమ