BTech Courses 2026: JEE Advanced అభ్యర్థులకు అలర్ట్.. NITల్లో కొత్త కోర్సుల్లో ఇవే..
BTech Courses 2026: జేఈఈ మెయిన్ 2026 రెండో దశ ఫలితాలను ఏప్రిల్ 20న విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. జనవరి, ఏప్రిల్ సెషన్లలో విద్యార్థులు సాధించిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకుని ఆల్ ఇండియా ర్యాంక్‌ను ఖరారు చేస్తారు. జేఈఈ మెయిన్‌లో అగ్రస్థానాల్లో నిలిచిన సుమారు 2.50 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. అనంతరం ఆ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జాతీయ సాంకేతిక సంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి. అయితే చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ సంప్రదాయ కోర్సులైన కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి బ్రాంచ్లకే పరిమితమవుతున్నారు. కానీ గత 3 సంవత్సరాలుగా అనేక జాతీయ సాంకేతిక సంస్థలు కొత్త తరహా బీటెక్ కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జాతీయ సాంకేతిక సంస్థలు ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారిస్తూ కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఎన్ఐటి ఢిల్లీ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్సును 2023–24 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. కంప్యూటర్ సైన్స్ మౌలికాంశాలతో పాటు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా విశ్లేషణ వంటి కీలక అంశాలను ఇందులో బోధిస్తారు. ఇదే సంస్థలో 2024లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును కూడా ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సు రూపుదిద్దుకుంది. అలాగే విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సు కూడా ప్రారంభమై చిప్ రూపకల్పనకు సంబంధించిన పూర్తి అవగాహనను విద్యార్థులకు అందిస్తోంది.
ఎన్ఐటి రూర్కెలా లో 2024–25 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ప్రవేశపెట్టబడింది. కంప్యూటర్ సైన్స్ ప్రామాణిక అంశాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించే విధంగా దీనిని రూపొందించారు. అలాగే ఎన్ఐటి కురుక్షేత్ర లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్సులను 2023–24 మరియు 2024–25 విద్యా సంవత్సరాల నుంచి ప్రారంభించారు. ఈ కోర్సుల్లో డేటా సైన్స్, యాంత్రిక అభ్యాసం వంటి ఆధునిక అంశాలను లోతుగా బోధిస్తున్నారు.
ఎన్ఐటి సూరత్కల్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును అందిస్తున్నారు. మెషిన్ లెర్నింగ్, డేటా విశ్లేషణ, డేటా విజువలైజేషన్ వంటి అంశాలపై విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎన్ఐటి వరంగల్ 2024–25 నుంచి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ప్రవేశపెట్టింది. ఇదే విధంగా ఎన్ఐటి కాలికట్ లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ప్రత్యేకతతో కూడిన కోర్సు అందుబాటులో ఉంది.
దేశంలో అగ్రశ్రేణి సంస్థలలో ఒకటైన ఎన్ఐటి తిరుచిరాపల్లి 2025–26 నుంచి డేటా సైన్స్ కోర్సును ప్రారంభించగా, ఎన్ఐటి సిల్చార్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కంప్యూటర్ సైన్స్ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులు సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఉండి భవిష్యత్తు సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు మెరుగైన అవకాశాలను అందిస్తాయి.
ప్రస్తుతం సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, విద్యార్థులు కొత్త తరహా కోర్సులపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. సరైన సమాచారం లేకపోవడం వల్ల మంచి అవకాశాలను కోల్పోకుండా, తమ ఆసక్తులు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా కోర్సును ఎంచుకోవడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: Tollywood: 7 వారాల్లో తొమ్మిదిన్నర కిలోలు తగ్గిన తారక్