Muhammad Ayub: ‘రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు’
Muhammad Ayub: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం వరంగల్‌లో నిర్వహించిన రైతు సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై పరుష పదజాలం ఉపయోగించడం, అన్ పార్లమెంటరీ భాషలో విమర్శలు చేయడం పూర్తిగా అనుచితమని ఆయన అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో ప్రజల సంపదను దోచుకున్నవారికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రైతు సభ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్న మహమ్మద్ అయూబ్.. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేశారు. గత ప్రభుత్వ కాలంలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, రైతు సమస్యలపై ఇప్పుడు మాట్లాడటం రాజకీయ నాటకమని ఆరోపించారు. వరి పంట విషయంలో రైతులను గందరగోళానికి గురి చేసిన ఘటనలను ప్రస్తావిస్తూ, పోడు భూముల విషయంలో దళితులకు ఇచ్చిన హామీలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి కేజీ టు పీజీ ఉచిత విద్య వరకు అనేక వాగ్దానాలు అమలు కాలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
2014 నుంచి 2023 వరకు తెలంగాణలో 641 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేస్తూ, రైతుల సంక్షేమంపై మాట్లాడే ముందు బీఆర్ఎస్ నాయకులు తమ పాలనను పరిశీలించుకోవాలని మహమ్మద్ అయూబ్ అన్నారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేసి రైతులకు ఊరటనిచ్చిందని, ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు.
కేటీఆర్ వ్యక్తిగత వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మర్యాదగా మాట్లాడాలని, ప్రజాస్వామ్యంలో విమర్శలకు ఒక హద్దు ఉంటుందని మహమ్మద్ అయూబ్ హెచ్చరించారు. వరంగల్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తగిన రీతిలో స్పందిస్తుందని స్పష్టం చేశారు. అలాగే వరంగల్‌కు చెందిన కొందరు బీఆర్ఎస్ నేతలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న పార్టీకి అనుగుణంగా వ్యవహరించే రాజకీయ నాయకుల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని అన్నారు.
ఈ సమావేశంలో వర్ధన్నపేట అధ్యక్షుడు ఎద్దు సత్యం, తూళ్ల రవి, గీసుకొండ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, దాడి శివ, సంఘ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, ఇండ్ల రవి, ఈగ దామోదర్, నాంపల్లి యాదగిరి, జన్ను అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Garuda Purnam: కుమారుడు లేకపోతే అంత్యక్రియలు ఎవరు చేయాలి?