Andhra Pradesh: అన్నం పెట్టలేదని భార్యపై కొడవలితో దాడి
Andhra Pradesh: పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం పరిధిలో ఉన్న మెట్టగూడెం గ్రామంలో కుటుంబ కలహాలు ఘోర పరిణామానికి దారితీశాయి. అన్నం పెట్టలేదన్న చిన్న కారణంతోనే భర్త రాజేంద్ర ప్రసాద్ తన భార్య బాడిస పాపాయమ్మపై దారుణంగా దాడి చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామస్థుల సమాచారం ప్రకారం ఇంట్లో జరిగిన సాధారణ వాగ్వాదం క్రమంగా తీవ్రరూపం దాల్చి, ఆవేశానికి లోనైన రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న కొడవలితో భార్యపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో ముఖ్యంగా కడుపు భాగంలో గాయాలు కావడంతో పాపాయమ్మ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు, సమీప గ్రామస్తులు వెంటనే స్పందించి ఆమెను అత్యవసరంగా గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు.
ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో మరింత మెరుగైన వైద్య సేవల కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో వెంటనే అక్కడికి రిఫర్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే గ్రామానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: TN Election Results: TVK విజయ్ సంచలనం.. 100కు పైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యం