Viral Video: ఓర్నీ.. అంబులెన్స్‌ను రన్నింగ్ ఓయోగా మార్చిన కిలాడీలు
Viral Video: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించేందుకు ఉపయోగించే అత్యవసర సేవ అంబులెన్స్. అలాంటి ప్రజల ప్రాణాలను కాపాడే వాహనాన్ని కొందరు యువకులు పూర్తిగా దుర్వినియోగం చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన 108 అంబులెన్స్‌ను వ్యక్తిగత వినోదం కోసం వినియోగించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వేగంగా వ్యాపించడంతో ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
https://twitter.com/ocjain4/status/2047109273256333634?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2047109273256333634%7Ctwgr%5E5b4b2db9d71f5b4073493a6fe37cec7ddd869e70%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Focjain4%2Fstatus%2F2047109273256333634
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా చూస్తే.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఒక అంబులెన్స్‌లో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న వారిని స్థానికులు గమనించారు. వాహనం కిటికీల్లోంచి చూసినప్పుడు ఒక యువతి, ఇద్దరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ అంబులెన్స్‌ను ఆపాలని ప్రయత్నించినా, అది ఆగకపోవడంతో సుమారు 5 కిలోమీటర్ల మేర వెంబడించి చివరకు నిలిపివేశారు. వాహనం తలుపులు తెరిచి పరిశీలించగా అందులో ఒక యువతి, ఇద్దరు యువకులు ఉన్నట్లు బయటపడింది.
అంబులెన్స్‌ను పరిశీలించిన స్థానికులు అందులో అత్యవసర సేవలకు సంబంధించిన ఎటువంటి పరికరాలు లేదా ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు. ఇది పూర్తిగా వ్యక్తిగత అవసరాల కోసం సిద్ధం చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. వారిని ప్రశ్నించగా తాము కుటుంబ సభ్యులమని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాకుండా అంబులెన్స్‌ను ఒక గది తరహాలో మార్చి వినియోగించినట్లు ఆరోపించారు. ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.
ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో వెంటనే చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక విచారణలో భాగంగా అంబులెన్స్ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన అత్యవసర సేవలను ఇలాంటి విధంగా దుర్వినియోగం చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: Pahalgam attack: ఏడాది తర్వాత కూడా మానని గాయం