Air Conditioner: మళ్లీ పెరిగిన ఏసీల ధరలు
Air Conditioner: వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండ తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడగాల్పులు, ఉక్కబోత కారణంగా మధ్యాహ్నం వేళల్లో రోడ్లు వెలవెలబోతున్నాయి. ఇంటి బయటకు రావడానికే చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇళ్లలో చల్లదనం కోసం ఏసీలు, కూలర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా సమ్మర్ ప్రారంభం నుంచే ఏసీలకు భారీ డిమాండ్ ఏర్పడటంతో మార్కెట్లో వాటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరలు పెరిగినా కూడా ప్రజలు అవసరానికి మించి ఖర్చు చేసి అయినా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటం గమనార్హం.
ఈ ఏడాది జనవరి నుంచి ఏసీల ధరలు గణనీయంగా పెరిగి దాదాపు 3 రెట్లు అధికమయ్యాయి. దీనికి ప్రధాన కారణంగా నియంత్రణ సంస్థ నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోవడం చెప్పవచ్చు. జనవరి నెలలో వచ్చిన కొత్త మార్పుల వల్ల ఏసీల తయారీ ఖర్చు పెరగడంతో కంపెనీలు ధరలను పెంచాయి. అంతేకాకుండా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో గల్ప్ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొనడం, విడిభాగాల సరఫరాలో అంతరాయం కలగడం కూడా ధరల పెరుగుదలకు దారితీసింది. మరోవైపు రాగి, ప్లాస్టిక్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, ఎలక్ట్రానిక్ పరికరాల ఖర్చు అధికమవడం వల్ల తయారీదారులు మరోసారి ధరలను సవరించారు. ముఖ్యంగా హీట్ ఎక్చేంజర్ల తయారీకి అవసరమైన వెల్డింగ్ ప్రక్రియలో వినియోగించే ఎల్పీజీ సరఫరా తగ్గిపోవడం ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల వల్ల మార్కెట్లో సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడంతో ధరలు మరింత ఎగబాకాయి.
ఇక కేంద్రం జనవరి 1 నుంచి అమలు చేసిన కొత్త నిబంధనల కారణంగా ఫైవ్ స్టార్ ఏసీల అవుట్ డోర్ యూనిట్ల పరిమాణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీనివల్ల అవసరమైన విడిభాగాలు అందుబాటులో లేకపోవడంతో తయారీ సంస్థలు త్రీ స్టార్ ఏసీల ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి. గత ఏడాది ఫైవ్ స్టార్‌గా ఉన్న కొన్ని మోడళ్లు ఈ ఏడాది త్రీ స్టార్‌గా మారడం కూడా మార్కెట్లో గందరగోళానికి దారితీసింది. పాత స్టాక్ క్రమంగా తగ్గిపోతుండగా కొత్త ఉత్పత్తి సరఫరా తక్కువగా ఉండటంతో వినియోగదారులు తమకు కావలసిన మోడళ్లను పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఏసీల అమ్మకాలు భారీగా పెరిగి 80 నుండి 90 శాతం వరకు వృద్ధి నమోదైంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమ్మకాలు అత్యధికంగా ఉండటం గమనించబడింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి రానున్న రోజుల్లో కూడా ఏసీల ధరలు మరింత పెరిగే అవకాశముందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ALSO READ: Viral: పెళ్లైన మహిళలు గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?