🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 August 2026, 10:13 am Posted by : STAR TRINETHRAM

Hanumakonda District: ‘స్టార్ త్రినేత్రం’ కథనాలకు కదులుతున్న నెట్‌వర్క్!

News Image

వేలేరు తహశీల్దార్ కార్యాలయ ఆరోపణలపై పెరుగుతున్న చర్చ
కథనాలపై ఆరా..
తమకూ అన్యాయం జరిగిందంటున్న ఇతర బాధితులు..?
ఉన్నతాధికారులు స్పందించాలని ‘బాధితుల’ విజ్ఞప్తి
Hanumakonda District: హనుమకొండ జిల్లా వేలేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ‘స్టార్ త్రినేత్రం’లో ప్రచురితమైన కథనాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కథనం వెలువడిన అనంతరం పలువురు ‘స్టార్ త్రినేత్రం’ను సంప్రదిస్తున్నారు. అదే సమయంలో తమకు కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని పనుల కోసం అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మరికొందరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ పేర్లు ప్రస్తుతం బయటకు వెల్లడించేందుకు ఇష్టపడకపోయినా, అవసరమైతే సంబంధిత ఆధారాలతో అధికారుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని, ఆరోపణల్లో నిజానిజాలు నిర్ధారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తమకు కూడా అన్యాయం జరిగిందంటూ మరికొందరు బాధితులు ‘స్టార్ త్రినేత్రం’ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అందువల్ల ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ‘బాధితులు’ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. విచారణ అనంతరం వాస్తవ పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ALSO READ: Hanumakonda District: తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు
🏠 Home