Telangana: న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్తే.. మహిళను గర్భవతిని చేసిన సీఐ
Telangana: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐపై నమోదైన కేసు తీవ్ర సంచలనం రేపింది. వివాహ సమస్యతో పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ఓ వివాహిత మహిళకు న్యాయం చేస్తానని నమ్మకం కల్పించి, తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెను మోసం చేశాడని, లైంగికంగా, మానసికంగా వేధించడమే కాకుండా గర్భస్రావానికి కూడా కారణమయ్యాడని ఆరోపిస్తూ సీఐ బానోత్ రాజు నాయక్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. అధికారికంగా నమోదైన ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో రాజు నాయక్‌కు పరిచయం ఏర్పడింది. ఫిర్యాదు పత్రంలో ఉన్న ఆమె వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను ఉపయోగించి తరచూ ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా సంప్రదిస్తూ, తన సమస్యకు చట్టపరంగా పూర్తి న్యాయం చేస్తానని నమ్మకం కల్పించినట్లు ఆరోపించారు. ఆ పరిచయం క్రమంగా వ్యక్తిగత సంబంధంగా మారగా, తాను ఆమెను వివాహం చేసుకుంటానని పలుమార్లు హామీ ఇచ్చి విశ్వాసాన్ని పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం తన అధికారాన్ని ఉపయోగించి బాధితురాలి భర్తపై ఒత్తిడి తీసుకువచ్చి, ఇటీవల కోర్టు ద్వారా విడాకులు జరిగేలా చేశాడని కూడా ఆరోపించారు.
విడాకుల తర్వాత తనపై పూర్తిగా నమ్మకం ఉంచిన బాధితురాలు గర్భవతి అయ్యిందని, ఆ సమయంలో పెళ్లి గురించి ప్రశ్నించగా సీఐ నిరాకరించాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా తనకు తెలియకుండా బలవంతంగా అబార్షన్ మాత్రలు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి గర్భస్రావం జరిగిందని, అనంతరం పెళ్లి విషయం ప్రస్తావిస్తే చంపేస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు ఈ నెల 7వ తేదీన ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రాథమిక విచారణలో సీఐ బానోత్ రాజు నాయక్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఖమ్మం సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్‌ను తక్షణమే అక్కడి నుంచి బదిలీ చేస్తూ హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, బాధితురాలికి పూర్తి స్థాయిలో చట్టపరమైన న్యాయం అందేలా అన్ని చర్యలు చేపడతామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ALSO READ: Interesting Fact: నిందితుల ముఖానికి పోలీసులు ముసుగు ఎందుకు వేస్తారు..?