Central Government: ఇక అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లు..?
Central Government: మారుతున్న సామాజిక పరిస్థితులు, మహిళల విద్యా స్థాయి, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సూచికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో మహిళల కనీస వివాహ వయసును ప్రస్తుతం అమల్లో ఉన్న 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే అంశంపై మరోసారి కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇటీవల వెలువడిన పలు సర్వేలు, రాబోయే జనగణన గణాంకాలను ఆధారంగా చేసుకుని ఈ మార్పుపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన జరుపుతోంది. వివాహ వయసు పెంపు ద్వారా మహిళలకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు ఆరోగ్య పరంగా కూడా ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో మహిళల సగటు వివాహ వయసు గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు 19.3 ఏళ్లుగా ఉన్న సగటు వివాహ వయసు ప్రస్తుతం 23.1 ఏళ్లకు చేరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మహిళల సగటు వివాహ వయసు 24.4 ఏళ్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో అది 22.6 ఏళ్లుగా నమోదైంది. మారుతున్న జీవనశైలి, విద్యాపై పెరిగిన అవగాహన, ఉద్యోగ అవకాశాల కోసం మహిళలు ఎక్కువగా ముందుకు రావడం వంటి కారణాలతో వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని వివాహ వయసుకు సంబంధించిన చట్టాన్ని కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మహిళల కనీస వివాహ వయసును పురుషులతో సమానంగా 21 ఏళ్లకు పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2021లో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉండగానే 17వ లోక్‌సభ రద్దు కావడంతో ఆ ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. ప్రస్తుతం 2027 జనగణన పూర్తయిన అనంతరం అందుబాటులోకి వచ్చే అధికారిక జనాభా గణాంకాల ఆధారంగా అదే బిల్లును మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టరూపం దాల్చేలా చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళల ఆరోగ్య రక్షణ, పోషకాహార లోపాల నివారణ, లింగ సమానత్వం బలోపేతం, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు మరింత ప్రాధాన్యం కల్పించడంలో ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ALSO READ: Cheapest Electric Car: హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న బుజ్జి ఎలక్ట్రిక్ కార్