Punnam Praveen: కానిస్టేబుల్‌కు సీపీ సన్‌ప్రీత్ సింగ్ ప్రశంసలు
రాయపర్తి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ప్రవీణ్‌కు రివార్డు అందజేత
అభినందించిన ఎస్సై ముత్యం రాజేందర్, ఇతర పోలీస్ సిబ్బంది
Punnam Praveen: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోర్టు ప్రాసెస్ విధులను సమర్థవంతంగా నిర్వహించి విశేష ప్రతిభ కనబరిచిన రాయపర్తి పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ పున్నం ప్రవీణ్‌కు రివార్డు అందింది. విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యతాయుత వైఖరి, కేసుల పర్యవేక్షణలో చూపిన నిబద్ధతను గుర్తించిన పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆయనను మంగళవారం ప్రత్యేకంగా అభినందిస్తూ రివార్డును అందజేశారు.
కోర్టు ప్రాసెస్ విధుల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ గుర్తింపు లభించడం రాయపర్తి పోలీస్ స్టేషన్ సిబ్బందికి గర్వకారణంగా నిలిచింది. విధి పట్ల అంకితభావంతో పనిచేస్తే ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని ఈ సందర్భంగా మరోసారి స్పష్టమైంది. పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా రివార్డు అందుకోవడం పున్నం ప్రవీణ్‌కు మరింత ఉత్సాహాన్ని కలిగించగా, రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్, సహచర పోలీస్ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే స్థాయి పనితీరును కొనసాగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ALSO READ: N.Swetha: వరంగల్ కమిషనరేట్‌కు తొలి మహిళా కమిషనర్