IND vs AFG: 2వ వన్డేకు మారనున్న టీమిండియా ప్లేయింగ్ 11..?
IND vs AFG: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే జూన్ 17న లక్నోలోని ఎకానా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చగా, హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్ బంతితో మెరిశారు. దీంతో రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
ఈ సిరీస్‌కు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం భారత జట్టుకు ఎదురుదెబ్బగా మారింది. గాయాల కారణంగా ఇద్దరూ మొత్తం సిరీస్‌కు దూరంగా ఉండటంతో యువ ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తున్నాయి. కోహ్లీ లేకపోవడంతో రెండో వన్డేలో ఇషాన్ కిషన్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్ పాత్రలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. యువ ఆటగాళ్లకు మరోసారి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఈ మ్యాచ్ ద్వారా లభించనుంది.
మొదటి వన్డేలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్ ఆకట్టుకోవడంతో వారిద్దరూ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. జట్టు కూర్పులో పెద్ద మార్పులు లేకపోయినా ఒకటి లేదా రెండు మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
రెండో వన్డే కోసం భారత జట్టు సంభావ్య తుది జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దుబే, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జూన్ 17, 2026న బుధవారం జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుండగా, టాస్ మధ్యాహ్నం 1:00 గంటలకు పడనుంది. లక్నోలోని ఎకానా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా నిలవనుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉండగా, జియోహాట్‌స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
భారత వన్డే జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత్ మరో విజయంతో ట్రోఫీని ఖాయం చేసుకోవాలని చూస్తుండగా, ఆఫ్ఘనిస్తాన్ మాత్రం సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ALSO READ: Viral Video: జూమ్ మీటింగ్‌లో ఉద్యోగి మాస్టర్ ప్లాన్‌కు జనం ఫిదా!