Andhra Pradesh: అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. కట్ చేస్తే
Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన మరింత సంచలనంగా మారింది. మృతుడి కుటుంబ సభ్యులు ఇది సాధారణ ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారం పిలిపించి దాడి చేసి హత్య చేశారని ఆరోపిస్తుండగా, మరోవైపు ప్రమాదవశాత్తు మిద్దెపై నుంచి పడిపోవడంతో గాయాలయ్యాయని మరో వాదన వినిపిస్తోంది. దీంతో ఈ ఘటన ప్రస్తుతం మిస్టరీగా మారి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మృతుడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లె గ్రామానికి చెందిన జయదీప్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం ఓ యువతి ఫోన్ చేసి గ్రామానికి రావాలని కోరడంతో జయదీప్ గంగవరం మండలం దండపల్లెకురప్పల్లె గ్రామానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఏమి జరిగిందనే విషయంపై స్పష్టత లేకపోయినా, కొంతసేపటి తర్వాత జయదీప్ తీవ్ర గాయాలతో ఉన్నాడని గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానికులు అతడు మిద్దెపై నుంచి కిందపడటంతో గాయపడ్డాడని చెప్పగా, వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని అతడిని చికిత్స కోసం తరలించారు.
మొదట జయదీప్‌ను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరులో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొద్ది రోజుల పాటు చికిత్స పొందిన జయదీప్ శనివారం మృతిచెందాడు. యువకుడి మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అయితే జయదీప్ మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి తరఫు వ్యక్తులే తమ కుమారుడిపై దాడి చేసి హత్య చేశారని వారు చెబుతున్నారు. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం కాదని, ముందే పథకం వేసుకుని జయదీప్‌ను గ్రామానికి రప్పించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఈ నెల 3వ తేదీన బంగారుపాళ్యానికి చెందిన ఇద్దరు యువకులు మోటార్‌సైకిల్‌పై జయదీప్‌ను దండపల్లెకురప్పల్లె గ్రామానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపితేనే అసలు నిజాలు బయటపడతాయని వారు అంటున్నారు.
మరోవైపు యువతి కుటుంబ సభ్యులు మాత్రం జయదీప్‌పై ఎలాంటి దాడి జరగలేదని, అతడు మిద్దెపై నుంచి కిందపడటంతోనే తీవ్రంగా గాయపడ్డాడని చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఈ ఘటనలో వాస్తవం ఏమిటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇది ప్రమాదమా, లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఈ ఘటనపై గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలంలోని పరిస్థితులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. అలాగే పోస్టుమార్టం నివేదిక కూడా కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే జయదీప్ మరణానికి అసలు కారణం ఏమిటన్నది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తుండగా, మృతుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.
ALSO READ: Entertainment: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న టాప్ వెబ్ సిరీస్‌లు ఇవే..