El Nino Effect: టెన్షన్‌లో అధికారులు
El Nino Effect: తెలంగాణలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం ఆందోళనకు దారి తీస్తోంది. దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, అధికార పార్టీ నాయకుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలపై ఆధారపడి ఉండే వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుండటంతో వర్షాభావ పరిస్థితులు కొనసాగితే రైతులతో పాటు పలు వర్గాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగించే కూలీలు, వ్యవసాయ యంత్రాల యజమానులు, ట్రాక్టర్ నిర్వాహకులు, విత్తనాలు, ఎరువుల వ్యాపారులు సహా లక్షలాది మందిపై దీని ప్రభావం ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయం సజావుగా సాగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చురుకుగా ఉంటుంది. కానీ వర్షాలు లేక పంటల సాగు ఆలస్యం అయితే ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యవసాయ కార్యకలాపాలు మందగిస్తే ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని, దీంతో రాజకీయంగా కూడా ప్రభావం ఉండొచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో కరువు పరిస్థితులు ఏర్పడిన సమయంలో రాజకీయంగా ఎదురైన పరిణామాలను గుర్తు చేసుకుంటూ ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకూడదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని రైతులతో పాటు పాలక వర్గాలు కూడా ఆశిస్తున్నాయి.
వాతావరణ శాఖ గణాంకాలు పరిశీలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాల పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. తెలంగాణలో మొత్తం 621 మండలాలు ఉండగా అందులో 289 మండలాల్లో ఇప్పటివరకు వర్షపాతం నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. మరో 313 మండలాల్లో స్వల్ప వర్షాలు మాత్రమే కురిశాయి. కేవలం 19 మండలాల్లో మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యాయి. సాధారణంగా జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి జూన్ 12 వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలోని దాదాపు సగం మండలాల్లో వర్షాలు కురవకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా కేవలం తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదవడంతో సాగు పనులు వేగం అందుకోవడం లేదు.
గత ఏడాది పరిస్థితులతో పోలిస్తే ఈసారి వర్షాల ప్రారంభం కొంత మందగించినట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం మే మూడో వారం నుంచే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే జూన్‌లో కొంతకాలం వర్షాలు తగ్గినా అనంతరం భారీ వర్షాలు కురవడంతో రైతులు, ప్రభుత్వ యంత్రాంగం, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో గేట్లను అనేక రోజుల పాటు ఎత్తి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయా లేదా అనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం భారీ వర్షాలు నమోదైన మండలాల జాబితాలో జగిత్యాల జిల్లా వెల్గటూరు, సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, గంబీరావుపేట, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, కందుకూరు, కేశంపేట, తలకొండపల్లి, కడ్తాల్, రాజేంద్రనగర్, వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట, మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్, నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ, కోడేర్, ఉప్పునుంతల, బల్మూర్, అచ్చంపేట మండలాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. రానున్న రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా మారి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిస్తేనే వ్యవసాయ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ఊపందుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: Viral Video: ఆమె ధైర్యానికి సెల్యూట్ కొడుతున్న నెటిజన్లు!