APSRTC: ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం
APSRTC: మహిళా ప్రయాణికుల సౌకర్యాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు అవసర సమయాల్లో ఉపయోగపడేలా శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మహిళా ప్రయాణికులకు అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపశమనం కలగనుంది. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
మహిళల ఆరోగ్యం, గౌరవం, ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను అమలు చేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఇటీవల రవాణాశాఖ మంత్రికి లేఖ రాశారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళలు అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఆర్టీసీ బస్సులో శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఈ ప్రతిపాదనపై రవాణాశాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాయపాటి శైలజ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మహిళల అవసరాలను గుర్తించి ప్రభుత్వం స్పందించడం అభినందనీయమని పేర్కొంటూ, “ఆమె గౌరవం.. మన బాధ్యత” అనే సందేశాన్ని పంచుకున్నారు. దీంతో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా నడిచే ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రతి బస్సులో మహిళలకు అవసరమైన సమయంలో సులభంగా ఉపయోగించుకునే విధంగా ఈ సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, అలాగే దూర ప్రయాణాలు చేసే మహిళలకు మరింత భరోసా కలగనుంది.
ఇక తెలంగాణలో కూడా మహిళల సౌకర్యాల కోసం ఇలాంటి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన బస్టాండ్లు, డిపోలు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శానిటరీ న్యాప్‌కిన్స్ వెండింగ్ యంత్రాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని రవాణాశాఖ, టీజీఎస్‌ఆర్టీసీతో పాటు సామాజిక సేవా సంస్థల సహకారంతో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలు అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనపు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచే నిర్ణయం కూడా అదే దిశగా తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. మహిళల ఆరోగ్య భద్రత, గౌరవాన్ని కాపాడే ఈ కార్యక్రమం అమలులోకి వస్తే వేలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.
ALSO READ: Tollywood: చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..