Women’s T20 World Cup 2026: అప్పుడే అన్ని లక్షల టిక్కెట్లు ఖతం!
Women’s T20 World Cup 2026: మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 టికెట్ విక్రయాలే నిదర్శనంగా నిలిచాయి. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి ఇప్పటికే దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడవడం చరిత్రాత్మక ఘట్టంగా మారింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో టోర్నీ ప్రారంభానికి ముందే ఇంత భారీ స్థాయిలో టికెట్లు విక్రయమైన సందర్భం ఇదే తొలిసారి కావడం విశేషం.
టోర్నీ ప్రారంభానికి ముందే అభిమానుల్లో నెలకొన్న ఉత్సాహం మహిళల క్రికెట్ భవిష్యత్తుకు మరింత బలాన్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మెగా ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇంగ్లండ్‌లోని స్టేడియాలు ఇప్పటికే సందడి వాతావరణాన్ని సంతరించుకున్నాయి. మహిళల క్రికెట్ ఇప్పుడు కేవలం ప్రత్యామ్నాయ క్రీడగా కాకుండా ప్రధాన క్రీడా వినోదంగా ఎదుగుతోందని ఈ టికెట్ విక్రయాలు స్పష్టం చేస్తున్నాయి.
టోర్నీ ప్రారంభానికి ఐదు రోజుల ముందుగా నిర్వహించిన ప్రత్యేక కెప్టెన్ల ఫొటోషూట్ కార్యక్రమం కూడా అభిమానులను ఆకట్టుకుంది. లండన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న 12 దేశాల జట్ల కెప్టెన్లు వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి తమ అభిమాన జట్లకు మద్దతు ప్రకటించారు. మహిళల క్రికెట్‌కు లభిస్తున్న ఆదరణ భవిష్యత్తులో ఈ క్రీడను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఐసీసీ డైరెక్టర్, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ పేర్కొన్నారు.
జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ప్రపంచకప్ కోసం పోటీ పడనున్నాయి. మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహించనుండగా, సెమీఫైనల్స్ జూలై తొలి వారంలో జరుగుతాయి. ఫైనల్ పోరుకు చారిత్రాత్మక లార్డ్స్ మైదానం వేదిక కానుంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక మైదానాల్లో ఒకటైన లార్డ్స్‌లో టైటిల్ పోరు జరగనుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టోర్నీ కోసం జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉండగా, గ్రూప్-2లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.
టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్..
భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌లో జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది. ఇటీవల ప్రపంచ వేదికపై అద్భుత ప్రదర్శనలు చేసిన భారత మహిళల జట్టు, ఈసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. అభిమానులు కూడా టీమిండియా నుంచి గొప్ప ప్రదర్శనను ఆశిస్తున్నారు.
ALSO READ:Crime: మేడపై ప్రియుడితో రొమాన్స్.. ముక్కుకోసేసిన భర్త