🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 June 2026, 4:07 pm Posted by : STAR TRINETHRAM

Bank Jobs: డిగ్రీ అర్హతతో 635 పోస్టులు.. ఇవాళ ఒక్కరోజే ఛాన్స్!

News Image
Bank Jobs: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతకు ఇది కీలక అవకాశం. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ & సింధ్ బ్యాంక్ భారీ స్థాయిలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 635 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ నియామక ప్రక్రియ మంచి అవకాశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఎంపిక జరగనున్న నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఈ నియామకాల కోసం దరఖాస్తు గడువు జూన్ 06, 2026తో ముగియనున్నందున ఆసక్తి ఉన్న వారు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 635 ఖాళీలు అందుబాటులో ఉండగా, ఇందులో దివ్యాంగుల కోటా పోస్టులు కూడా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి రెగ్యులర్ విధానంలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,300 స్టైఫెండ్ అందించనున్నారు. అయితే ప్రయాణ భత్యం లేదా ఇతర దినసరి అలవెన్సులు ఉండవని స్పష్టం చేశారు. అప్రెంటీస్ శిక్షణ కాలం 12 నెలలు, అంటే 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది.

ఈ నియామకాల్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. పూర్తిగా మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంటర్మీడియట్ (10+2 లేదా హెచ్‌ఎస్‌సీ)లో సాధించిన మార్కుల ఆధారంగా రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా మెరిట్ జాబితా రూపొందించబడుతుంది. మెరిట్ జాబితాలో స్థానం సంపాదించిన అభ్యర్థులకు వైద్య పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. దీంతో పోటీ పరీక్షల ఒత్తిడి లేకుండా బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టాలనుకునే వారికి ఇది మంచి అవకాశం కానుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా అప్రెంటీస్ నమోదు పోర్టళ్లలో తమ ప్రొఫైల్‌ను 100 శాతం పూర్తి చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం NAPS Portal-https://www.apprenticeshipindia.gov.in/ లేదా NATS Portal- https://nats.education.gov.in/ లో నమోదు పూర్తి చేయాలి. అనంతరం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ https://punjabandsind.bank.in/ ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తును సమర్పించాలి. గడువు ముగియడానికి ముందు అన్ని వివరాలను సరిచూసుకుని దరఖాస్తు పూర్తి చేయడం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ALSO READ:Hyderabad: లేట్‌గా వస్తోందని రాత్రిపూట కొడుకు ముందే భార్యపై..
🏠 Home