Viral Video: అదే భారతీయుడు చేస్తే.. కథ వేరేలా ఉండేది..?
Viral Video: హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ధర్మశాలలో ఓ విదేశీ పర్యాటకుడు మద్యం మత్తులో సృష్టించిన హంగామా తీవ్ర కలకలం రేపింది. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో అతడు చేసిన వీరంగానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. స్థానిక వ్యాపారులు, బాటసారులను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/i/status/2062375732094108071
ధర్మశాలలోని కచేరి చౌక్, కొత్వాలి బజార్ ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న విదేశీ పర్యాటకుడు రోడ్డు పక్కన ఉన్న కూరగాయల దుకాణాల వద్దకు వెళ్లి అక్కడి సరుకులను లాక్కొని రోడ్డుపైకి విసిరేశాడు. దీంతో వ్యాపారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అతడి ప్రవర్తనతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, మార్కెట్‌లో కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు, బాటసారులు భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. కొంతసేపు మార్కెట్ ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
అంతటితో ఆగకుండా, అక్కడ పార్క్ చేసి ఉన్న ఓ టాక్సీ వాహనంపై అతడు పెద్ద రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. మార్కెట్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనను చూసిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానికులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, మద్యం మత్తులో ఉన్న అతడు మరింత దూకుడుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో విధుల్లో ఉన్న ఓ మహిళా ట్రాఫిక్ పోలీసు అధికారి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే సదరు విదేశీ పర్యాటకుడు ఆమెతో కూడా దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక వ్యాపారులు, పౌరులు కలిసి అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు అక్కడికి చేరుకునే వరకు అతడు మార్కెట్ ప్రాంతంలోనే హంగామా కొనసాగించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విదేశీ పర్యాటకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వివరాలు, వీసా సంబంధిత పత్రాలు, ధర్మశాలలో బసకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. విదేశీ పర్యాటకులు స్థానిక చట్టాలు, సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి ఘటన విదేశాల్లో భారతీయుడు చేసి ఉంటే తీవ్ర చర్యలు తీసుకునేవారని, చట్టం ముందు అందరూ సమానమేననే సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాలని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదే అయినప్పటికీ, బాధ్యతాయుతమైన ప్రవర్తన ప్రతి పర్యాటకుడి కర్తవ్యమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
ALSO READ: Sports: శాంసన్ vs శ్రేయస్.. కౌన్ బనేగా టీ20 కెప్టెన్..?