Finance: PPF అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడం ఎలా..?
Finance: దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత విశ్వసనీయమైన పొదుపు పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. దీర్ఘకాలిక పెట్టుబడిగా, భద్రతతో పాటు పన్ను ప్రయోజనాలు అందించే ఈ పథకంలో లక్షలాది మంది పెట్టుబడులు పెడుతున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేసే అవకాశం ఉండటంతో మధ్యతరగతి ప్రజలకు ఇది మంచి ఎంపికగా మారింది. అయితే, ప్రతి సంవత్సరం కనీసం రూ.500 జమ చేయడం తప్పనిసరి. ఒకవేళ ఈ కనీస మొత్తాన్ని జమ చేయకపోతే ఖాతా నిలిచిపోతుంది. దీంతో చాలామందిలో ఆందోళన నెలకొంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు కోల్పోయే ప్రమాదం ఏమాత్రం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో పెట్టుబడులు పూర్తిగా సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు.
ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కనీస మొత్తం జమ చేయకపోతే ఖాతా నిలిచిపోయినట్లవుతుంది. ఈ పరిస్థితిలో ఖాతాదారులు కొన్ని సేవలను కోల్పోతారు. ముఖ్యంగా ఖాతాపై రుణం పొందే అవకాశం ఉండదు. అలాగే ఖాతాలోని మొత్తాన్ని భాగంగా తీసుకునే అవకాశం కూడా నిలిపివేయబడుతుంది. పన్ను మినహాయింపులు పొందే సౌకర్యం కూడా తాత్కాలికంగా నిలిచిపోతుంది. అయితే, ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఖాతాను మళ్లీ చెల్లుబాటులోకి తెచ్చుకోవడానికి స్వల్ప జరిమానా చెల్లించడం సరిపోతుంది. ప్రతి నిలిచిపోయిన సంవత్సరానికి రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక సంవత్సరం ఖాతా నిలిచిపోయి ఉంటే రూ.50, రెండు సంవత్సరాలు అయితే రూ.100 చెల్లించాలి. అదేవిధంగా ఆ సంవత్సరాలకు చెల్లించాల్సిన కనీస డిపాజిట్ రూ.500 చొప్పున జమ చేయాలి. ఉదాహరణకు రెండు సంవత్సరాలు జమ చేయకపోతే రూ.1000 డిపాజిట్‌తో పాటు రూ.100 జరిమానా చెల్లించాలి. మొత్తంగా రూ.1100 చెల్లించడం ద్వారా ఖాతాను తిరిగి చెల్లుబాటులోకి తెచ్చుకోవచ్చు.
ఖాతాను తిరిగి ప్రారంభించుకోవడానికి ఖాతాదారు తన ఖాతా ఉన్న బ్యాంక్‌కు వెళ్లి వ్రాతపూర్వకంగా దరఖాస్తు సమర్పించాలి. సంబంధిత అధికారులు ఖాతా వివరాలను పరిశీలించిన తర్వాత ఖాతాను మళ్లీ చెల్లుబాటులోకి తీసుకువస్తారు. ఖాతా యాక్టివ్ అయిన వెంటనే అన్ని సౌకర్యాలు తిరిగి అందుబాటులోకి వస్తాయి. రుణం తీసుకోవడం, అవసరమైనప్పుడు కొంత మొత్తం ఉపసంహరించుకోవడం వంటి సేవలు మళ్లీ ప్రారంభమవుతాయి. అందుకే ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 జమ చేయడం ద్వారా ఖాతా ఎప్పుడూ చెల్లుబాటులో ఉండేలా చూసుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. చిన్న మొత్తంతో ప్రారంభమైన ఈ పెట్టుబడి, కాలక్రమేణా పెద్ద మొత్తంగా మారి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది.
ALSO READ: Social Media: చాటింగ్ పేరుతో చీటింగ్.. వీడియో కాలింగ్‌తో లూటింగ్