AP: ఆ జిల్లాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు..?
AP: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరింత పెరుగుతున్న వేళ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని 23 మండలాల్లో ఆదివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురంమన్యం జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉండొచ్చని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర మండలాల్లో వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే పార్వతీపురంమన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో కూడా తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు శనివారం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు జిల్లా నగరడోనలో 44.8 డిగ్రీలతో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, కడపలో 44.2 డిగ్రీలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీలు నమోదు కాగా, మార్కాపురం జిల్లా కంభం, శ్రీసత్యసాయి జిల్లా తలుపలలో 43 డిగ్రీలు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా నూలివీడు, పల్నాడు జిల్లా గురజాలలో 42.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.6 డిగ్రీలు, తిరుపతి జిల్లా బేస్తపల్లిలో 42.5 డిగ్రీలు నమోదు అయ్యాయి. అనకాపల్లి జిల్లా దేవరపల్లె, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 42.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 28 జిల్లాల్లో 18 జిల్లాలకు చెందిన 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది.
ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. అవసరం లేకుంటే మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, ఎండలో వెళ్లాల్సి వస్తే టోపీ, తల కప్పుకునే వస్త్రాలు ఉపయోగించాలని సూచించారు. ముఖ్యంగా చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కళ్ల రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ వినియోగించాలని, వృద్ధులు, చిన్నారులు, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతున్నవారు ఎండలో తిరగరాదని స్పష్టం చేశారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి రక్షణ కోసం నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు తరచూ తీసుకోవాలని సూచించారు.
వడగాల్పులు, ఉక్కపోత, ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీయొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసేవలు పొందాలని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు.
ALSO READ: IPL 2026: ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోనే కుప్పకూలిన సాహిల్ (VIDEO)