🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 October 2026, 8:11 am Posted by : STAR TRINETHRAM

Nagaram Division: ఎంగిలి పూల బతుకమ్మ సంబరాల్లో ఏనుగు సుదర్శన్ రెడ్డి

News Image
Nagaram Division: నాగారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సంబరాలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. కాలనీవాసుల ఆహ్వానం మేరకు బీజేపీ నాయకుడు, మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకుంటుండగా, ఆయన వారితో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ఆత్మీయంగా ముచ్చటించి, సోదరీ సోదరుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు పీవీఆర్ (పోతంశెట్టి వెంకటేశ్వర రావు), మామిడి జంగా రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్య శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కర్ర వెంకటేశ్వర్, నాగ మల్లేశ్వర్ పాల్గొన్నారు.

ALSO READ: Interesting Fact: భార్య.. భర్తకు రాఖీ కట్టవచ్చా?.. పురాణాల్లో ఏముంది..?
🏠 Home