Hyderabad: కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్.. ఉద్రిక్తత
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు బీఆర్‌ఎస్ నేతలు నలుపు టీషర్ట్లు ధరించి, ఫ్లకార్డులు చేతబట్టి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని భద్రతా సిబ్బంది, పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని చివరకు తోపులాటకు దారితీసింది.
పోలీసులు తమను అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ నేతలు రోడ్డుపైనే కూర్చొని నిరసన చేపట్టారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళన కారణంగా రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తెలంగాణ భవన్‌కు తరలిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతల ఆందోళనలు, పోలీసుల అరెస్టులతో అసెంబ్లీ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ALSO READ: Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..