Wardhannapet: ఆకట్టుకుంటున్న కేఫ్ కాకా-టీ-యా
Wardhannapet: వర్ధన్నపేట పట్టణంలో న్యూ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఏర్పాటు చేసిన ‘కేఫ్ కాకా-టీ-యా’ స్థానిక ప్రజలు, ప్రయాణికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రారంభమైన కొద్ది కాలంలోనే ప్రత్యేకమైన బెల్లం చాయ్, రుచికరమైన మిల్క్‌షేక్స్, ఔట్ డోర్ స్క్రీనింగ్ మరియు ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణంతో ఈ కేఫ్ మంచి గుర్తింపు పొందింది.
ప్రస్తుతం కేఫ్‌లో ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు వివిధ రకాల టిఫిన్లు, సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు టిఫిన్లు మరియు స్నాక్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కొత్త సేవలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కేఫ్ ప్రత్యేకతల్లో ప్రధానమైనది దీని నిర్మాణ శైలి. కాకతీయుల ఆలయ నిర్మాణ సంప్రదాయంలోని "త్రికూటాలయం" భావన నుంచి స్ఫూర్తి పొంది మూడు వైపులా తాటి షెడ్లతో ఈ కేఫ్‌ను రూపొందించారు. వెయ్యి స్తంభాల గుడి, పాలంపేట రామప్ప ఆలయం, పిల్లలమర్రి, పానగల్ వంటి చారిత్రక కట్టడాల నిర్మాణ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఈ ప్రాంగణం ఏర్పాటు చేయబడింది.
వర్ధన్నపేట పరిసర ప్రాంతాల్లోనే కాకుండా బొల్లికుంట నుండి తొర్రూరు వరకు ఇలాంటి ప్రత్యేక కేఫ్ లేదా ఫుడ్‌కోర్ట్ లేకపోవడంతో స్థానిక ప్రజలు, కుటుంబాలు, యువతకు ఇది ఒక ఆహ్లాదకరమైన సమావేశ కేంద్రంగా మారింది. అలాగే కరీంనగర్–ఖమ్మం ప్రధాన రహదారిపై ప్రయాణించే వారికి విశ్రాంతి తీసుకుంటూ చాయ్, టిఫిన్లు, మిల్క్‌షేక్స్ ఆస్వాదించేందుకు అనువైన ప్రదేశంగా నిలుస్తోంది.
త్వరలో ఫాస్ట్ ఫుడ్ మరియు మధ్యాహ్న భోజన (మెస్) సేవలను కూడా ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పరిశుభ్రమైన ఆహారం, సాంప్రదాయ రుచులు, ప్రత్యేక వాతావరణంతో కేఫ్ కాకా-టీ-యా మరింత మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది.
వర్ధన్నపేట ప్రజలతో పాటు కరీంనగర్- ఖమ్మం మార్గంలో ప్రయాణించే వారందరికీ కేఫ్ కాకా-టీ-యా హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది.
ALSO READ: క్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే బిల్లు ఎవరు కడతారు? ఎవరి బాధ్యత?