🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 20 May 2026, 7:42 pm Posted by : STAR TRINETHRAM

Palakurthi Sarangapani: రేపు వర్ధన్నపేటలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం

News Image

అంబేద్కర్ సెంటర్‌లో ఘన నివాళులు
ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పాల్గొననున్న మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి

Palakurthi Sarangapani: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా 21-05-2026 గురువారం ఉదయం 8:30 గంటలకు వర్ధన్నపేట టౌన్‌లోని అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రత్యేక నివాళి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై, రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించనున్నారని తెలియజేశారు. దేశ అభివృద్ధికి, యువత సంక్షేమానికి, సాంకేతిక రంగ పురోగతికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ALSO READ: Kamal Haasan: 4 ఏళ్ల పాటు థియేటర్లను ఊపేసిన సినిమా భయ్యా!.. ఒక్క క్లైమాక్స్ కోసమే జనం క్యూ కట్టారు..
🏠 Home