🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 May 2026, 8:46 pm Posted by : STAR TRINETHRAM

MLA Nagaraju: ఖచ్చితమైన జనగణనతోనే అభివృద్ధికి బలమైన పునాది..

News Image

“ప్రతి ఇంటి సమాచారం- దేశ అభివృద్ధికి బాట”..
“జనాభా గణనలో భాగస్వామ్యం.. అభివృద్ధిలో ముందడుగు"..
“ఉజ్వల భవిష్యత్తు కోసం.. మనమంతా కలిసి ముందుకు సాగుదాం”..
జనాభా గణనలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా పాల్గొనాలి..
సమగ్ర సమాచారం ద్వారానే ప్రజలకు మెరుగైన సంక్షేమం, అభివృద్ధి ఫలాలు..
జనాభా గణన దేశ భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది
: జిల్లా కలెక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే నాగరాజు

MLA Nagaraju: వరంగల్ జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే జనాభా గణన (Census) అత్యంత కీలకమని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్.నాగరాజు పేర్కొన్నారు. ఆదివారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన జనాభా గణన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు.

అనంతరం జనగణన అవగాహన పురస్కరించుకుని మార్నింగ్ వాక్‌లో భాగంగా నాయకులు, కార్యకర్తలు అధికారులతో కలిసి కలెక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే నాగరాజు మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనాభా గణన అనేది కేవలం లెక్కలు సేకరించే ప్రక్రియ మాత్రమే కాకుండా దేశ భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే మహత్తర కార్యక్రమమని అన్నారు. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి గురించి సమగ్ర సమాచారం సేకరించడం ద్వారా ప్రభుత్వాలు ప్రజల అవసరాలను అంచనా వేసి సరైన విధానాలు రూపొందించగలుగుతాయని తెలిపారు.

ప్రత్యేకంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు, గృహ నిర్మాణం, ఉపాధి అవకాశాలు, మహిళా మరియు బాలల సంక్షేమం వంటి రంగాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు Census ద్వారా లభించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రజలు జనాభా గణన సిబ్బందికి పూర్తి సహకారం అందించి ఖచ్చితమైన వివరాలు ఇవ్వాలని కోరారు. సరైన సమాచారం అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజల సహకారంతోనే ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు విజయవంతమవుతాయని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని, అందులో జనాభా గణన ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.

ఈ అవగాహన ర్యాలీలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, వర్ధన్నపేట ఫ్యాక్స్ చైర్మన్ రాజేష్ ఖన్నా, వైస్ చైర్మన్ నేతావాత్ శిభారాణి-రాజేందర్, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, నునావత్ కమ్లి-కీమా, మలోత్ దేవేందర్, తిరుపెళ్లి వాణి-కుమారస్వామితో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తూళ్ల రవి, పట్టణ పార్టీ అధ్యక్షుడు మైస సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు ఈగ దామోదర్, పోశాల వెంకన్న గౌడ్‌తో పాటు సర్పంచ్లు, మండల, టౌన్ పార్టీ నాయకులు కార్యకర్తలు, యూత్, మహిళలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Sudhakar Goud: ఇంధన ధరల పెంపు.. కేంద్రంపై బండి సుధాకర్ గౌడ్ ఆగ్రహం
🏠 Home