Aruri Ramesh: సామాన్యుడికి ఒక చట్టం.. కేంద్ర మంత్రి కుమారుడికి మరో చట్టమా?
పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా రక్షిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్, కేంద్ర బీజేపీ!..
అధికార మదంతో కేసులను నీరుగార్చడం మహిళా లోకానికే అవమానం.
న్యాయం అందరికీ ఒక్కటే ఉండాలి..
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి!
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ డిమాండ్
Aruri Ramesh: తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు ఒక చట్టం.. ప్రముఖులకు మరో చట్టం అమలవుతుందా..? అని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి బుధవారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో అరూరి రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ ఫోక్సో కేసు నమోదు అయినా ఆ నిందితులను వెంటనే అరెస్టు చేసి విచారణ వేగవంతంగా పూర్తి అవుతుందని.. కానీ బండి సంజయ్ కొడుకు విషయంలో మాత్రం ప్రత్యేక చట్టాలు అమలు అవుతున్నట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డికి.. భారతీయ జనతా పార్టీకి లోపాయికారి ఒప్పందం వల్లే బండి భగీరథ విషయంలో ఇంకా అరెస్టు జరగలేదని విమర్శించారు. కేసును నీరు గార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని.. రాష్ట్రంలో జరిగే ప్రతి పోక్సో కేసు పై సిట్ వేసి విచారణ చేస్తారా.? అంటూ విమర్శించారు.
కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ సామాజిక బాధ్యతగా.. బేషరతుగా తన కుమారుడిని పోలీసుల ఎదుట హాజరు పరిచి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేసును నీరుగార్చాలని ప్రయత్నాలు చేస్తే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని అరూరి రమేష్ డిమాండ్ చేశారు.
శాంతి భద్రతలు కరువయ్యాయి.. ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు..
10 ఏళ్లలో కెసిఆర్ హయాంలో ఆర్థికంగా అభివృద్ధి చెందితే.. రెండున్నర ఏళ్లలో క్రైమ్ లో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాలు అయినా ఒక్క పెట్టుబడి రాలేదు కానీ.. రోజుకో అత్యాచారం జరుగుతుందన్నారు.
ఇకనైనా ప్రభుత్వం మేలుకొని బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్లు వనం రెడ్డి, జక్కు రమేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు తూళ్ల కుమారస్వామి, పట్టణ మాజీ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, పీఏసీఎస్ డైరెక్టర్ మార్త సారంగపాణి, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ సిలివేరు శ్రీధర్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పూజారి రఘు, ఎలికట్టే యాకయ్య, తుమ్మల శ్రీధర్, బానోత్ నవీన్, తుమ్మల కుమారస్వామి, ఇలబెల్లి ఆనందం తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Dream Science: కలలో ట్రాన్స్జెండర్లు కనిపిస్తే అర్థం ఏమిటి?