Kalvakuntla Kavitha: జగిత్యాల బీఆర్ఎస్ సభపై కవిత ప్రశ్నలు
Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో తాజాగా వేడి మరింత పెరిగింది. జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ సభను కేంద్రంగా చేసుకుని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ ముఖ్యమైన జాతీయ అంశాలపై స్పందించకపోవడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు అసలు సమస్యలను ప్రస్తావించకుండా పిట్టకథలు చెప్పినట్టుగా సభను నిర్వహించారని ఆరోపిస్తూ, పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జగిత్యాలలో జరిగిన సభలో ప్రస్తావించాల్సిన కీలక అంశాలు ఎక్కడా కనిపించలేదని కవిత వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహిళా బిల్లు, డీలిమిటేషన్ వంటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకునే స్థాయిలో ఆలోచనలు లేకుండా వ్యవహరించడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. అంతేకాకుండా తన తండ్రి కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ, ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే సభ నిర్వహించారని విమర్శించారు.
యువతకు అవకాశాల విషయంలో కూడా బీఆర్ఎస్ వైఖరిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. 75 ఏళ్ల వ్యక్తిని యువకుడిగా చూపిస్తే రాష్ట్రంలోని యువత పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. తాము ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ వేదికలో యువతకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదని, ఆడబిడ్డల భద్రతపై కూడా స్పష్టమైన భరోసా ఇవ్వలేదని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని కూడా బీఆర్ఎస్ విస్మరించిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్షం సభలతో కాలక్షేపం చేస్తున్నాయని విమర్శించారు. జీవన్‌రెడ్డి వంటి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తెలంగాణకు వ్యతిరేక ధోరణి కలిగినవారిగా అభివర్ణించారు.
ఇంకా పేరు ప్రస్తావించకుండా ఢిల్లీకి వెళ్లిన నేతపై కూడా ఆమె పరోక్ష విమర్శలు చేశారు. కాళేశ్వరం వ్యవహారంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ పెద్దలను కలిశారని ఘాటుగా ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలను అనుసరిస్తూ బీఆర్ఎస్ ముందుకు సాగుతోందని విమర్శిస్తూ, సీజన్ ముగిసిన తర్వాత రైతు భరోసా ప్రకటిస్తే ఉపయోగమేంటని ప్రశ్నించారు.
ఇక ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన కవిత, ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులను బెదిరించడం సరైంది కాదని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, జాబ్ క్యాలెండర్‌తో పాటు ఉద్యోగాల కల్పనలో స్పష్టత లేకపోవడాన్ని ఆమె ఎత్తిచూపారు. ప్రతిపక్షం లేకుండా పాలన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజల సమస్యలను విస్మరించే పాలన సాగదని హెచ్చరించారు.
ALSO READ: Weather Update: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు..