Telangana Politics: కవిత ‘బ్లూ వార్’ సిద్ధం!
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపేలా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటుపై వేగం పెంచారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భావ తేదీని ప్రకటించిన ఆమె.. తాజాగా పార్టీ జెండా రంగును వెల్లడిస్తూ రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమయ్యారు. తమ పార్టీ జెండాలో నీలి రంగుకు ప్రధాన ప్రాధాన్యత ఉంటుందని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసిన కవిత.. ఈ రంగు తమ దార్శనికతను, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ‘కలర్ థియరీ’ అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించడంతో కొత్త పార్టీ అజెండాపై మరింత ఆసక్తి పెరిగింది.
కొత్త పార్టీ పేరుపై కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రారంభంలో ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ, తరువాత పరిణామాలు కొత్త మలుపు తిప్పాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తిరిగి వినియోగించాలనే ఆలోచనపై కవిత తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాత పేరు, కొత్త జెండా, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని ఆమె ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ ఆవిర్భావం, జెండా, విధివిధానాలు, సిద్ధాంతాలను ఏప్రిల్ 25న అధికారికంగా ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మునీరాబాద్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ వర్గాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ రూపకల్పనలో కవిత బిజీగా ఉన్నారు.
పార్టీ సిద్ధాంతాల విషయంలో కూడా కవిత స్పష్టత ఇస్తున్నారు. నీలి రంగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతీకగా భావిస్తున్నట్లు ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు 50 కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వివిధ వర్గాల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు అందించే దిశగా ఈ కమిటీలు పనిచేస్తాయని సమాచారం.
మహిళా శక్తి ప్రాధాన్యంపై కూడా కవిత ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటివరకు పురుషులు స్థాపించిన పార్టీలను మాత్రమే చూశామని, ఒక మహిళగా తాను పార్టీ స్థాపిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. యువతతో పాటు మహిళలకు పార్టీలో కీలక స్థానాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మౌలిక అవసరాలైన నీళ్లు, నిధులు, నియామకాల సాధన దిశగా తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ALSO READ: Journalism: ఎవరు జర్నలిస్ట్?.. ఎవరికి అక్రిడిటేషన్?