Gas Cylinder: 5 కేజీల సిలిండర్‌పై కేంద్రం మరో కీలక నిర్ణయం
Gas Cylinder: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేయబడటంతో గ్యాస్, చమురు రవాణా దెబ్బతింది. ఈ పరిణామం నేరుగా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడే భారతదేశంపై ప్రభావం చూపుతోంది. దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఉత్పత్తి, సరఫరాను పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ సంస్థలు 5 కేజీల చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశపెట్టగా, ఇవి తక్కువ కాలంలోనే ప్రజల్లో విపరీత ఆదరణ పొందాయి.
దేశవ్యాప్తంగా 5 కేజీల గ్యాస్ సిలిండర్ల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. మార్చి 23 నుంచి ఇప్పటివరకు 13 లక్షలకుపైగా సిలిండర్లు అమ్ముడైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. రోజుకు లక్షకు పైగా విక్రయాలు నమోదవుతున్నాయి. ఈ చిన్న సిలిండర్లకు ప్రత్యేకత ఏమిటంటే.. వీటిని కొనుగోలు చేయడానికి కఠినమైన పత్రాలు అవసరం లేదు. గ్యాస్ ఏజెన్సీలు లేదా పెట్రోల్ బంకులకు వెళ్లి ఒక సాధారణ ధృవీకరణ పత్రం చూపిస్తే సరిపోతుంది. గ్యాస్ అయిపోయిన తర్వాత కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంకులు లేదా సమీప గ్యాస్ కేంద్రాల్లో సులభంగా రీఫిల్ చేసుకునే అవకాశం ఉంది. వలస కార్మికులు, అద్దె గదుల్లో ఉండే విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన ప్రత్యామ్నాయంగా మారింది. అంతేకాకుండా తక్కువ ధరలో లభించడం కూడా ప్రజలను ఆకర్షిస్తోంది.
ఇక మరోవైపు పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని పెంచేందుకు కూడా కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఇటీవల కాలంలోనే 4,24,000 కొత్త కనెక్షన్లు మంజూరు చేయగా, దాదాపు 30,000 మంది తమ ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేసి ఈ వ్యవస్థకు మారినట్లు సమాచారం. అయితే కమర్షియల్ వినియోగంలో ఉన్న 19 కిలోల గ్యాస్ సిలిండర్ల కొరత మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా రూ.2,000 ఉండే ఈ సిలిండర్ ధర కొరత కారణంగా బ్లాక్ మార్కెట్‌లో రూ.6,000 వరకు పెరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల వ్యాపారులు ఖర్చులను పెంచి వినియోగదారులపై భారం మోపుతున్నారు. ఫలితంగా సాధారణ ప్రజల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్యాస్ కొరతను తగ్గించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. అయితే తాత్కాలికంగా చిన్న సిలిండర్లు, పైప్ గ్యాస్ విస్తరణ వంటి చర్యలు ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయ పరిణామాలు సద్దుమణిగే వరకు ఇంధన ధరలపై ఒత్తిడి కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Jos Buttler: అర్థశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్