🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 April 2026, 2:15 pm Posted by : STAR TRINETHRAM

Tollywood: బాక్సాఫీస్ కా బాప్.. ఈ పాన్ ఇండియా హీరో ఎవరో గుర్తు పట్టారా?

News Image
Tollywood: పైన ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టడం చాలా మందికి కష్టంగా అనిపించినా, ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ స్టార్ హీరో. చిన్న వయసులోనే సినీరంగంలో అడుగుపెట్టి, తన ప్రతిభతో వరుస విజయాలను అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. మాస్ యాక్షన్ నుంచి ప్రేమ కథల వరకు అన్ని రకాల పాత్రల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకున్న ఈ నటుడు మరెవరో కాదు జూనియర్ నందమూరి తారక రామారావు. ఇటీవల విడుదలైన దేవర చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం భారీ అంచనాల మధ్య కొత్త ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచే అంచనాలు గగనాన్ని తాకుతున్నాయి. అయితే కొంతకాలంగా ఎన్టీఆర్ లుక్‌లో వచ్చిన మార్పులు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ సినిమా కోసం ఆయన బాగా సన్నబడటం, శరీరాన్ని పూర్తిగా మార్చుకోవడం వంటి విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

తాజాగా ఎన్టీఆర్ తన కండలు తిరిగిన శరీరంతో ఫోటోను పంచుకోవడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఫోటోతో పాటు ఇది కష్టపడి సాధించినదే తప్ప కొనుగోలు చేసినది కాదని పేర్కొనడం మరింత ఆకర్షణగా నిలిచింది. కోచ్ కుమార్ మన్నవ శిక్షణలో ఎన్టీఆర్ ఈ ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం. ఈ ఫోటోను పంచుకుంటూ అదే సమయంలో డ్రాగన్ సినిమాను సూచించడం ద్వారా ఈ లుక్ పూర్తిగా ఆ సినిమా కోసమే అని స్పష్టమైంది.

డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో కొత్తగా కనిపించబోతున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పూర్తి భిన్నమైన రూపంలో అభిమానులకు కనిపించబోతున్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో మరోసారి సంచలనం సృష్టిస్తాడని ఆశలు పెరిగాయి. ఈ సినిమాలో కన్నడ సినీ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, గత కొన్ని నెలలుగా షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ALSO READ: Telangana: డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్‌లో ప్రభుత్వం మార్పులు
🏠 Home