OTT: దెయ్యాల సినిమాలో తోపు మూవీస్ మావ.. ఒంటరిగా చూస్తే సుస్సు పడుద్ది జాగ్రత్త!
OTT: హారర్ సినిమాలు అంటే చీకట్లో చూసినప్పుడే భయం పెరుగుతుందని అనుకోవడం సహజం. కానీ కొన్ని సినిమాలు మాత్రం వెలుతురు మధ్యలో కూడా గుండెల్లో వణుకు పుట్టిస్తాయి. జంప్ స్కేర్స్‌పై కాకుండా, వాతావరణం, నెమ్మదిగా పెరిగే టెన్షన్, పాత్రల మానసిక స్థితి ద్వారా భయాన్ని సృష్టించే సినిమాలు ఇవి. అలాంటి డిఫరెంట్ అనుభూతి ఇచ్చే 7 హారర్ మూవీస్‌పై ఒక లుక్కేద్దాం.
1. Bhoot Part One: The Haunted Ship
షిప్పింగ్ ఆఫీసర్ ఫృథ్వి తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో ఉంటాడు. ఓ రోజు ఖాళీగా ఉన్న ఓ భారీ నౌక ముంబై తీరానికి చేరుతుంది. దాన్ని పరిశీలించడానికి వెళ్లిన అతనికి అక్కడ విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఓ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆ నౌకలో దాగి ఉన్న భయంకరమైన అతీంద్రియ శక్తి రహస్యం బయటపడుతుంది. నెమ్మదిగా పెరిగే టెన్షన్ ఈ సినిమాకు ప్రధాన బలం.
స్ట్రీమింగ్: Amazon Prime Video
2. Lights Out
లైట్ ఆఫ్ చేస్తేనే కనిపించే భూతం అనే సింపుల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. రెబెక్కా తన చిన్ననాటి భయాల నుంచి బయటపడినప్పటికీ, తన తమ్ముడు కూడా అదే భూతాన్ని చూడటం ప్రారంభిస్తాడు. ‘డయానా’ అనే ఆ శక్తి వారి కుటుంబంతో ఉన్న అనుబంధం కథను మరింత భయానకంగా మారుస్తుంది.
స్ట్రీమింగ్: Amazon Prime Video
3. It
డెర్రీ అనే పట్టణంలో పిల్లలు మాయమవుతూ ఉండటానికి కారణం ‘పెన్నీవైస్’ అనే భయంకరమైన క్లౌన్. పిల్లల భయాలనే ఆయుధంగా చేసుకునే ఈ పాత్ర హారర్‌లో ఐకానిక్‌గా నిలిచింది. స్నేహం, ధైర్యం, భయం అన్ని కలిసిన కథ ఇది.
స్ట్రీమింగ్: YouTube
4. The Grudge
టోక్యోలో ఓ ఇంట్లో జరిగిన ఘోర హత్యల వల్ల ఏర్పడిన శాపం కథ ఇది. ఆ ఇంట్లోకి వెళ్లిన వాళ్లను మాత్రమే కాదు, వాళ్లు ఎక్కడికెళ్లినా వెంటాడే శాపం ఈ సినిమాలో భయాన్ని మరింత పెంచుతుంది. ఎక్కడున్నా వెంటపడే ఆత్మల కాన్సెప్ట్ చాలా క్రీపీగా ఉంటుంది.
స్ట్రీమింగ్: Amazon Prime Video
5. Personal Shopper
పారిస్‌లో షాపర్‌గా పనిచేసే మౌరీన్, తన చనిపోయిన అన్నతో సంప్రదించాలనే ఆశతో ఉంటుంది. అనూహ్యంగా తెలియని నంబర్ నుంచి మెసేజెస్ రావడం మొదలవుతుంది. అది ఆత్మనా? లేక మరేదైనా శక్తినా? లేక మానవుడేనా? అనే సందేహాలతో కథ ముందుకు సాగుతుంది. ఇది హారర్‌తో పాటు సైకాలజికల్ టెన్షన్‌ను కూడా అందిస్తుంది.
స్ట్రీమింగ్: Amazon Prime Video
6. Drag Me to Hell
ఓ చిన్న నిర్ణయం ఎలా పెద్ద శాపంగా మారుతుందో చూపించే కథ ఇది. క్రిస్టిన్ అనే ఉద్యోగిని ఒక వృద్ధురాలికి సహాయం చేయకపోవడంతో ‘లామియా’ అనే దుష్టాత్మ శాపానికి గురవుతుంది. మూడు రోజుల్లో ఆమె జీవితాన్ని నరకంగా మార్చే సంఘటనలు గుండెల్లో దడ పుట్టిస్తాయి.
స్ట్రీమింగ్: Amazon Prime Video
7. Bramayugam
17వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మలయాళ ఫోక్ హారర్ మూవీ పూర్తిగా వాతావరణంతో భయాన్ని సృష్టిస్తుంది. అడవిలో తప్పిపోయిన గాయకుడు ఒక రహస్యమైన ఇంటిలో చిక్కుకుంటాడు. అక్కడ కాలం, నిజం అన్నీ వక్రీభవించినట్లు అనిపిస్తాయి. ‘చాథన్’ అనే దెయ్యం చుట్టూ తిరిగే ఈ కథ పూర్తిగా వేరే లెవెల్ అనుభూతిని ఇస్తుంది.
స్ట్రీమింగ్: SonyLIV
ఈ సినిమాల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి ఒక్కసారిగా భయపెట్టవు, కానీ నెమ్మదిగా మనసులో భయాన్ని నాటుతాయి. వెలుతురు ఉన్నా కూడా గుండెల్లో ఒక తెలియని భయం కలిగించే ఈ సినిమాలు నిజంగా హారర్ అంటే ఏమిటో చూపిస్తాయి.
ALSO READ: Post Office: ఈ అదిరిపోయే స్కీమ్ గురించి తెలుసా?.. రూ.300 ఆదా చేస్తే చేతికి రూ.15 లక్షలు