IPL 2026: రాజస్థాన్ సంచలన విజయం.. గుజరాత్‌పై 6 పరుగుల తేడాతో గెలుపు
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగిన ఈ పోరులో తుషార్ దేశ్‌పాండే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్ ఆశలను చిదిమి, రాజస్థాన్‌కు గెలుపు అందించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రవి బిష్ణోయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బ్యాట్స్మెన్లు గుజరాత్ బౌలర్లపై ఆధిపత్యం చాటారు.
ధ్రువ్ జురెల్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేసి జట్టు స్కోర్‌ను బలపరిచాడు. అతనికి తోడుగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు సాధించి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 31 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ 18 పరుగులతో వేగం పెంచే ప్రయత్నంలో ఔటవ్వగా, కెప్టెన్ రియాన్ పరాగ్ 8 పరుగులు, డోనోవన్ ఫెరీరా 1 పరుగుతో నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ తలో వికెట్ పడగొట్టగా, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నాడు.
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రారంభంలోనే బలంగా కనిపించింది. సాయి సుదర్శన్, కుమార్ కుసంగర కలిసి మొదటి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు అద్భుత ఆరంభం అందించారు. కుమార్ కుసంగర 18 పరుగులు చేసి రియాన్ పరాగ్ బౌలింగ్‌లో హెట్మెయర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జాస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు. మంచి ఊపులో ఉన్న సాయి సుదర్శన్ 44 బంతుల్లో 73 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే గ్లెన్ ఫిలిప్స్ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ 4 పరుగులు చేసి మళ్లీ బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న బట్లర్ 14 బంతుల్లో 26 పరుగులు చేసి నంద్రే బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
తదుపరి దశలో తెవాటియా వంటి ప్రమాదకర ఆటగాడిని కూడా రవి బిష్ణోయ్ ఔట్ చేయడంతో గుజరాత్ కష్టాల్లో పడింది. షారుఖ్ ఖాన్ రన్ అవుట్ కావడంతో జట్టు మరింత ఒత్తిడిలోకి వెళ్లింది. చివర్లో రషీద్ ఖాన్, కగిసో రబాడా కలిసి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. చివరి ఓవర్లో గెలవడానికి 11 పరుగులు అవసరమైన సమయంలో తుషార్ దేశ్‌పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి రషీద్ ఖాన్ వికెట్ తీసి, కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో గుజరాత్ జట్టు 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రాజస్థాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పగా, నంద్రే బర్గర్, రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ALSO READ: ఈ మొక్క ఇంటి దగ్గర ఉంటే పాములకు గజగజే..