Smartphone Offers: బంపరాఫర్.. 17 ప్రో మ్యాక్స్‌పై రూ.49,000 తగ్గింపు!
Smartphone Offers: టెక్ ప్రపంచంలో ప్రముఖ స్థానం సంపాదించిన ఆపిల్ తన 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలో భారీ తగ్గింపును ప్రకటించింది. ప్రారంభ ధర రూ.1,49,900గా ఉన్న ఈ ప్రీమియం ఫోన్, ఇప్పుడు రూ.1,02,900కు అందుబాటులోకి రావడం వినియోగదారులకు ఆకర్షణీయమైన అవకాశంగా మారింది. ఈ ఆఫర్ ప్రత్యేకంగా ఇమాజిన్ స్టోర్ ద్వారా మాత్రమే లభిస్తోంది. అత్యాధునిక కెమెరా వ్యవస్థ, శక్తివంతమైన ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ప్రీమియం విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ భారీ ధర తగ్గింపు వెనుక పలు ఆఫర్లు పనిచేస్తున్నాయి. బ్యాంక్ ద్వారా రూ.4000 క్యాష్‌బ్యాక్, అదనంగా రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తోంది. అలాగే పాత ఫోన్‌ను మార్పిడి చేసుకునే వారికి రూ.6000 ఎక్స్చేంజ్ బోనస్, అలాగే గరిష్టంగా రూ.36000 వరకు ఎక్స్చేంజ్ విలువ అందిస్తున్నారు. ఈ అన్ని ప్రయోజనాలను కలిపి చూసినప్పుడు ఫోన్ ధర రూ.102900కు పడిపోయింది. ఇదే సమయంలో ఐఫోన్ 17 ప్రో ధరను కూడా రూ.89900కు తగ్గించడం గమనార్హం.
ఈ సేల్ కేవలం ఐఫోన్‌లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇతర ఆపిల్ పరికరాలపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఐప్యాడ్ 2025 వైఫై ధరను రూ.34900 నుంచి రూ.31900కు తగ్గించారు. అలాగే ఆపిల్ వాచ్ వివిధ మోడళ్లపై కూడా ధరల్లో తగ్గింపులు ఉన్నాయి. ప్రీమియం ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఈ ఆఫర్లు మంచి అవకాశం అందిస్తున్నాయి. సాధారణంగా ఆపిల్ ఉత్పత్తులపై ఇంత పెద్ద స్థాయిలో తగ్గింపులు అరుదుగా కనిపిస్తాయి.
ఫీచర్ల పరంగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అత్యాధునిక సాంకేతికతను అందిస్తుంది. ఇది 6.9 అంగుళాల 120 హెర్ట్జ్ ప్రో మోషన్ ఓఎల్ఈడి డిస్‌ప్లేను కలిగి ఉండి, అద్భుతమైన దృశ్య అనుభూతిని ఇస్తుంది. ఇందులో కొత్త ఎ19 ప్రో చిప్, 12జీబీ ర్యామ్ ఉండటంతో అత్యంత వేగవంతమైన పనితీరును అందిస్తుంది. కెమెరా వ్యవస్థలో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8ఎక్స్ ఆప్టికల్ జూమ్ వంటి ఫీచర్లు ఉండటం ఫోటోగ్రఫీ ప్రేమికులను ఆకట్టుకుంటాయి. బ్యాటరీ సామర్థ్యం కూడా బలంగా ఉండి, 37 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. వైఫై 7 సపోర్ట్, కొత్త డిజైన్ వంటి అంశాలు ఈ ఫోన్‌ను మరింత ప్రీమియంగా నిలబెడుతున్నాయి.
ALSO READ: IPL 2026: ముంబైతో ఢిల్లీ.. రాజస్థాన్‌తో గుజరాత్ ఢీ.. గెలుపెవరిదో?