Weather Alert: ఎండలు దంచికొట్టే ఛాన్స్!
Weather Alert: వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలను మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏప్రిల్ నెల ప్రారంభంతోనే ఎండల ప్రభావం మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రానున్న 3 నెలలు ప్రజలకు కఠినమైన కాలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో 3 నుంచి 4 రోజులు తీవ్ర వేడి గాలులు వీస్తాయని, మే మరియు జూన్ నెలల్లో ఈ వేడి గాలుల ప్రభావం 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువగా కొనసాగవచ్చని వెల్లడించారు. పగటి వేళలతో పాటు రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇప్పటికే రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. సాధారణంగా మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈసారి ఏప్రిల్ నుంచే కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేమ ఎక్కువగా ఉండటంతో ఉక్కపోతతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు ఏప్రిల్ నెల మొత్తం కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
గోదావరి జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని సూచిస్తున్నారు. రాయలసీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల నంద్యాల జిల్లాలో 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడం రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏప్రిల్ నెలలో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యమధ్యలో పడుతున్న తేలికపాటి వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా రాబోయే 3 నెలల వాతావరణ పరిస్థితులపై విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిషా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నాయని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో సాధారణ స్థాయిలో లేదా కొద్దిగా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
అంతేకాకుండా దేశంలోని సుమారు 95 శాతం ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయని అంచనా వేసింది. ఏప్రిల్ నెలలో ఈశాన్య రాష్ట్రాలు మినహా పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మార్చి నెలలో సాధారణ వర్షపాతం 29.9 మిల్లీమీటర్లు ఉండగా, ఈసారి 33.7 మిల్లీమీటర్లు నమోదయ్యాయి. గత 125 సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే మార్చిలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవడం ఇది 32వసారి కావడం విశేషంగా భావిస్తున్నారు.
ALSO READ: Cabinet Expansion: 2029లో కేబినెట్ విస్తరణలో లక్కీ ఛాన్స్ ఎవరికో?