🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 March 2026, 10:49 pm Posted by : STAR TRINETHRAM

Vijay's Speech: జగన్, పవన్‌పై పంచులు? (VIDEO)

News Image
Vijay's Speech: కోలివుడ్ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ రంగప్రవేశం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్, ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తిగా విజయ్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం, పొత్తులకు దూరంగా ఉండటం వంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఊపందుకున్నాయి.

https://twitter.com/PapalakeyPapa/status/2038911156677685688?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2038911156677685688%7Ctwgr%5Ee7d2f907764cde1f23c68297977be5e63fe32768%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FPapalakeyPapa%2Fstatus%2F2038911156677685688

ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో విజయ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భారీ చర్చ మొదలైంది. ‘Sandy Papa YSCRP’ అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో విజయ్ మాట్లాడిన మాటలకు తెలుగు అనువాదం జోడిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు చూపించారు. అందులో గొడ్డలితో దాడి చేసి అధికారంలోకి రావడం తనకు తెలియదని, కోడి కత్తి డ్రామాలు చేయనని, ఆస్తి కోసం కుటుంబ సభ్యులను దూరం చేసుకునే వ్యక్తిని కాదని పేర్కొన్నట్లు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి చేసినవిగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

అయితే వాస్తవానికి ఆ వీడియోలో విజయ్ చేసిన ప్రసంగం పూర్తిగా వేరే కోణంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన తన రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వివరిస్తూ ప్రజల కోసం సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి వచ్చానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని చెప్పారు. తాను ఎప్పుడూ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి పని చేయనని హామీ ఇచ్చారు. తమిళనాడులో ఎంత పార్టీలు వచ్చినా అసలు పోటీ రెండు శక్తుల మధ్యనే జరుగుతుందని, అందులో ఒకటి తమ పార్టీ కాగా మరొకటి డీఎంకే అని పేర్కొన్నారు. ప్రజలపై ఆధిపత్యం ప్రదర్శించే నాయకత్వం కావాలా లేదా ప్రజలతో అనుబంధం కలిగిన నాయకత్వం కావాలా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను మీ కుటుంబ సభ్యుడిలా భావించి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.

ఇదే సమయంలో విజయ్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలను కూడా రాజకీయ కోణంలో మలచి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా పొత్తులపై ఆయన చెప్పిన మాటలను ఏపీ రాజకీయాలతో ముడిపెడుతూ వివిధ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాను ఎవరి జెండా మోసే పరిస్థితి రానీయనని, స్వతంత్రంగా పోటీ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నానని ఆయన చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని వైసీపీ వర్గాలు పవన్ కళ్యాణ్, టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

ALSO READ: Telangana: ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
🏠 Home